Home
Deal of the day

రూ.8499 ధరకే 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, 50MP సోనీ కెమెరా 5G స్మార్ట్‌ఫోన్!

పోకో ఈ సంవత్సరం భారత్‌ మార్కెట్‌ లో అనేక మోడల్స్‌ ను లాంచ్‌ చేసింది. ఇందులో భారీ బ్యాటరీ ఫోన్‌ పోకో F7 కూడా ఉంది. అయితే ఈ సంవత్సరం తొలి భాగంలో లాంచ్‌ అయిన పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ ను (Poco M7 5G Smartphone pricedrop) భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ భారీ డిస్‌ప్లేతోపాటు స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. మరియు 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, డిస్కౌంట్‌ వివరాలు.

భారత్‌లో విడుదల సమయంలో పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11499 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఎటువంటి బ్యాంకు కార్డుల అవసరం లేకుండానే డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Poco M7 5G smartphone telugu news

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ ఫెస్టివ్ ధమాకా సేల్‌ లో (Flipkart Big Festive Dhamaka Sale) భాగంగా రూ.2000 తగ్గింపునకు అందుబాటులో ఉంది. ఫలితంగా ఈ ఫోన్‌ 6GB/128GB ధర రూ.8499, 8GB/128GB ధర రూ.9499 గా ఉంది. దీంతోపాటు బ్యాంకు కార్డులపై మరింత తగ్గింపును పొందవచ్చు.

పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.88 అంగుళాల HD+ భారీ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే TUV సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. మింట్‌ గ్రీన్‌, శాటిన్‌ బ్లాక్‌, ఓసియన్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ పోకో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 ప్రాసెసర్‌ తో పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఈ ఫోన్‌ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని పోకో తెలిపింది.

50MP సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరా, మరో కెమెరాను అమర్చారు. దీంతోపాటు ఫ్లాష్‌ లైట్‌ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు :
పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్‌, Wi-Fi, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. IP52 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M7 5G smartphone now available at Rs8499 on Flipkart Big Festive Dhamaka Sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X