Home
Deal of the day

రూ.10999 ధరకే 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 7000mAh భారీ బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌..!

Poco M7 Plus 5G Smartphone : పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో 2025 ఆగస్టు నెలలో విడుదల అయింది. రూ.15 వేల కంటే తక్కువ ధరలో లాంచ్‌ అయినా.. 7000mAh భారీ బ్యాటరీ, 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లేని కలిగి ఉంది. అయితే విడుదల సమయంలో 6GB, 8GB ర్యామ్ వేరియంట్స్‌ మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. గత నెలలో 4GB ర్యామ్ వేరియంట్‌ను కూడా లాంచ్ చేశారు.

ప్రారంభ ధర రూ.10999 :
ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బ్యాంగ్ దీపావళి 2025 సేల్‌ లో (Flipkart Big Bang Diwali 2025) భాగంగా పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.10999 కే కొనుగోలు చేయవచ్చు.

Poco M7 plus 5G smartphone price Rs10999

రూ.2000 డిస్కౌంట్‌తో :
అయితే విడుదల సమయంలో ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13999 గా ఉండేది. ప్రస్తుతం రూ.11999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ రూ.14999 గా ఉండేది. ప్రస్తుతం రూ.12999 కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

భారీ డిస్‌ప్లే, IP64 రేటింగ్‌ :
పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.9 అంగుళాల ఫుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 850 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 288Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆక్వా బ్లూ, కార్బన్‌ బ్లాక్, క్రోమ్‌ సిల్వర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Poco M7 plus 5G smartphone price Rs10999

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP ప్రైమరీ, 7000mAh భారీ బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ, సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్, 18W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Poco M7 plus 5G smartphone price Rs10999

సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ :
కనెక్టివిటీ పరంగా 5G, 4G, WiFi, బ్లూటూత్ 5.1, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M7 plus 5G smartphone now available at Rs10999 price in flipkart big bang diwali 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X