Home
Deal of the day

రూ.11999 ధరకు 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 7000mAh భారీ బ్యాటరీ 5G ఫోన్‌!

Poco M7 Plus 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ పోకో ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో పోకో M7 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ను తీసుకొచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.12 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీని కలిగి ఉంది. మరియు 50MP కెమెరాను కలిగి ఉంది.

రూ.11999 ప్రారంభ ధరకే :
ప్రస్తుతం ఈ ఫోన్‌ విడుదల ధరతో పోలిస్తే భారత్‌ మార్కెట్‌ లో డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.11999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.13,999 గా ఉంది.

Poco M7 plus 5G

మూడు కలర్‌ వేరియంట్స్ :
దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ కార్బన్‌ బ్లాక్, ఆక్వా బ్లూ, క్రోమ్‌ సిల్వర్‌ కలర్‌ వేరియంట్స్‌ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 7000mAh భారీ బ్యాటరీ :
పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల ఫుల్‌ HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 850 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 288Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోరర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 18W రివర్స్‌ ఛార్జింగ్‌ ను కూడా సపోర్టు చేస్తుంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ పోకో స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 3 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2.0 తో పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని హామీ ఇచ్చింది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా పోకో M7 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ, సెకండరీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను కలిగి ఉంది. 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.1, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు ఉన్నాయి.

త్వరలో పోకో నుంచి గ్లోబల్‌ మార్కెట్‌లోకి పోకో F8 సిరీస్‌ విడుదల కానుంది. అయితే భారత్‌ మార్కెట్లో ఈ ఫోన్‌ విడుదలపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M7 plus 5G smartphone with 7000mAh battery available at Rs11999 price on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X