50MP + 20MP కెమెరాలు, 5110mAh బ్యాటరీ 5G ఫోన్‌పై రెండు నెలల్లోనే రూ.1500 తగ్గింపు..!
భారత్ మార్కెట్‌లో గత సంవత్సరం డిసెంబర్ నెలలో పోకో రెండు 5G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. పోకో C75 5G మోడల్‌ను రూ.8000 కంటే తక్కువ ధరకు లాంచ్ చేసింది. పోకో M7 ప్రో 5G ఫోన్‌ను రూ.15000 ధరలో తీసుకొచ్చింది. అయితే కేవలం రెండు నెలల్లోనే ఈ ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 5110mAh బ్యాటరీ సహా పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ పోకో 5G ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Poco M7 Pro 5G Smartphone Pricedrop) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. విడుదల సమయంలో ఈ ఫోన్ 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.14999 గా ఉండేది. అదే 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.16999 గా ఉండేది.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.13999, 8GB ర్యామ్ స్టోరేజీ ధర రూ.15999 గా ఉంది. అంటే రూ.1000 ధర తగ్గింది. దీంతోపాటు అన్ని బ్యాంకు కార్డులపై రూ.500 డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఫలితంగా ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13499 గా ఉండనుంది. అదే మరో వేరియంట్ ధర రూ.14499 గా ఉంటుంది.
దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ లూనార్ డస్ట్, ఓలివ్ ట్విలైట్, లావెండర్ ఫ్రాస్ట్ రంగుల్లో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. రూ.15,000 కంటే తక్కువ ధరలో 5G ఫోన్ కొనుగోలు చేసే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్‌గా ఉండే అవకాశం ఉంది.
పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు :
ఈ పోకో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ (1080*2400 పిక్సల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2100 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 రక్షణ ను పొందుతుంది.
ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 20MP కెమెరానును కలిగి ఉంది. 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5110mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.
పోకో ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్ తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. మల్టీ టాస్కింగ్ సహా ఇతర సందర్భాల్లో మెరుగైన పనితీరును అందిస్తుందని పోకో చెబుతోంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, WiFi, బ్లూటూత్ 5.3, GPS, GLONASS, 3.5mm ఆడియో జాక్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.
* ఈ ఫోన్‌తోపాటు విడుదల అయిన పోకో C75 5G ఫోన్ ఒకే స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. ధర రూ.7999 గా ఉంది. ఆక్వా బ్లిస్, సిల్వర్ స్టార్ డస్ట్, ఎన్‌ఛాంటెడ్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. తక్కువ ధరలో భారీ బ్యాటరీ, భారీ డిస్‌ప్లే కావాలనుకొనే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.
ఈ పోకో C75 5G ఫోన్ 6.88 అంగుళాల HD+ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది. 50MP ప్రైమరీ కెమెరా, మరో లెన్స్‌ను అమర్చారు. 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు 18W ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








