రూ.12999 ధరకు 50MP సోనీ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5G స్మార్ట్‌ఫోన్!
పోకో సంస్థ భారత్ మార్కెట్ లో ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్ లను విడుదల చేసింది. మిడ్ రేంజ్ లో పోకో F7 మోడల్ ను తీసుకొచ్చింది. అదే దీంతోపాటు పోకో M7 ప్లస్ 5G సహా మరిన్ని ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇటీవలే పోకో నుంచి C85 5G ఫోన్ విడుదల అయింది. అయితే గత సంవత్సరం విడుదల అయిన పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా, అమోలెడ్ డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్ లు, ఫీచర్‌ల వివరాలు.
రూ.12999 ప్రారంభ ధరకే :
భారత్ మార్కెట్ లో విడుదల సమయంలో పోకో M7 ప్రో 5G స్మార్ట్ ఫోన్ (Poco M7 Pro 5G Smartphone) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14,999 గా ఉండగా.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.12999 ధరకు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.16999 ధరగా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో (Flipkart) రూ.14999 ధరకు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

మీడియాటెక్ చిప్‌సెట్ :
పోకో M7 ప్రో 5G హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. రెండు స్టోరేజీ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే :
ఈ ఫోన్ 6.67 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో (AMOLED Display) అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను పొందుతోంది. లావెండర్ ఫ్రాస్ట్, ఓలివ్ ట్విలైట్, లూనార్ డస్ట్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
50MP సోనీ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ పోకో M7 ప్రో 5G స్మార్ట్ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ( OIS ) సపోర్టుతో 50MP సోనీ LYT 600 ప్రైమరీ ఉంది. దీంతోపాటు 2MP డెప్త్ సెన్సర్ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరాను కలిగి ఉంది.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
ఈ హ్యాండ్‌సెట్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5110mAh బ్యాటరీతో పనిచేస్తోంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్ లను కలిగి ఉంది. సెక్యురిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. 5G, 4G, బ్లూటూత్ 5.3, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








