Home
Deal of the day

బడ్జెట్ ధరలో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 3D కర్వడ్ డిస్‌ప్లే, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌!

Poco M8 5G Smartphone : భారత్‌ మార్కెట్‌ లో గత నెలలో పోకో సంస్థ M8 5G స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 3 ప్రాసెసర్‌ పైన పనిచేస్తోంది. దీంతోపాటు 3D కర్వడ్ డిస్‌ప్లే, 50MP కెమెరాను కలిగి ఉంది. డిజైన్‌ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది.

ధర, సేల్ వివరాలు :
పోకో M8 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.20999 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ ను కూడా పొందవచ్చు.

Poco M8 5G Smartphone with 6 years of updates now available at Rs17999 price on Flipkart

3D కర్వడ్‌ డిస్‌ప్లే, వెట్‌ టచ్ ఫీచర్‌ :
పోకో స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 387 ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వెట్‌ టచ్‌ 2.0 సపోర్టును కలిగి ఉంది. ఫలితంగా తడి చేతులతోనూ ఫోన్‌ ను ఉపయోగించుకోవచ్చు.

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ :
ఈ హ్యాండ్‌సెట్ MIL STD 810 మిలిటరీ గ్రేడ్‌, SGS సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఫలితంగా పొరపాటున కిందపడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ పోకో ఫోన్ ఫ్రాస్ట్‌ సిల్వర్‌, కార్బన్‌ బ్లాక్, గ్లేసియల్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
పోకో M8 5G హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 3 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ LPDDR4x ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తోంది. 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

50MP కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలున్నాయి. వీటితోపాటు 20MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి. ఈ ఫోన్ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5520mAh బ్యాటరీని కలిగి ఉంది. 18W రివర్స్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది.

IP66 రేటింగ్ :
కనెక్టివిటీ పరంగా పోకో M8 5G స్మార్ట్‌ఫోన్ 5G, 4G LTE, బ్లూటూత్ 5.1, వైఫై 5, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉంది. IP65, IP66 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

Best Mobiles in India

English summary
Poco M8 5G Smartphone with 6 years of updates now available at Rs17999 price on Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X