తొలి 12 గంటల్లో కొనుగోలు చేసిన వారికి రూ.15999 ధరకే 5G స్మార్ట్‌ఫోన్..!
Poco M8 5G Smartphone Sale : పోకో సంస్థ నుంచి భారత్ మార్కెట్లోకి ఇటీవల పోకో M8 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ 3D కర్వడ్ డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ చిప్, ఆండ్రాయిడ్ 15 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. అయితే తొలి సేల్‌లో భాగంగా ఆకట్టుకొనే ఆఫర్‌ను ప్రకటించింది.
రూ.15999 ధరకే :
పోకో M8 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. అయితే తొలి 12 గంటల్లో కొనుగోలు చేసిన యూజర్లకు ఈ ఫోన్‌ను రూ.15999, రూ.16999, రూ.18999 ధరకే అందిస్తామని తెలిపింది.

అయితే 12 గంటల అనంతరం 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.22999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్, ఫ్రాస్ట్ సిల్వర్, గ్లేసియల్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.
పోకో M8 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తుంది. ఈ పోకో స్మార్ట్‌ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
3D కర్వడ్ డిస్‌ప్లే :
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 3200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 387 ppi పిక్సల్ డెన్సిటిని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే వెట్ టచ్ 2.0 ను సపోర్టు చేస్తుంది. అంటే తడిచేతులతోనూ వినియోగించుకోవచ్చు.

50MP, 20MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 20MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయని పోకో తెలిపింది.
ఫాస్ట్ ఛార్జింగ్ :
బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5520mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 18W రివర్స్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది.అయితే ఈ ఫోన్ 5 సంవత్సరాల వరకు మెరుగైన బ్యాటరీ లైఫ్ అందిస్తుందని పోకో చెబుతోంది.
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఈ ఫోన్ MIL STD 810 మిలిటరీ గ్రేడ్, SGS సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ IP65 + IP66 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 5G, 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.1, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








