Samsung Galaxy A32 పై భారీగా ధ‌ర త‌గ్గింపు.. ఇది చ‌ద‌వండి!

|

ద‌క్షిణ కొరియా టెక్ దిగ్గ‌జం Samsung, వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు నిత్యం అనేక ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తుంది. తాజాగా, ఈ కంపెనీ నుంచి గ‌తేడాది లాంచ్ అయిన Samsung Galaxy A32 మొబైల్ భారతీయ మార్కెట్లో ధర తగ్గింపును అందుకుంది. దాని రెండు కాన్ఫిగరేషన్ ఎంపిక‌లపై ధ‌ర‌లు తగ్గించడంతో అవి రెండు రూ.20వేల సెగ్మెంట్‌లో చేరాయి.

 
Samsung Galaxy A32 పై భారీగా ధ‌ర త‌గ్గింపు.. ఇది చ‌ద‌వండి!

కంపెనీ మొద‌ట‌, గత ఏడాది మార్చిలో Galaxy A32 కు సంబంధించి ఏకైక 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌తో భార‌త్‌లో లాంచ్ చేసింది. దీని ధర రూ.21,999 గా నిర్ణ‌యించింది. ఆ త‌ర్వాత ఈ మోడ‌ల్‌కు సంబంధించి 8GB RAM వేరియంట్‌ను కూడా లాంచ్ చేసింది.

భారతదేశంలో Samsung Galaxy A32 మొబైల్స్ కొత్త ధరలు:

భారతదేశంలో Samsung Galaxy A32 మొబైల్స్ కొత్త ధరలు:

Samsung Galaxy A32 యొక్క 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌ని విక్రేత‌ల ఆధారంగా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ మోడల్ ధ‌ర గతేడాది మార్చిలో రూ.21,999 గా ఉంది.. కాగా దీన్ని ఇప్పుడు అమెజాన్ ద్వారా రూ.18,500 కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఇక, Samsung స్మార్ట్‌ఫోన్ యొక్క 8GB RAM + 128GB వేరియంట్ విష‌యానికొస్తే.. గత సంవత్సరం నవంబర్‌లో దీని ధ‌ర‌ రూ.23,499 గా ఉంది.. కాగా, ఇప్పుడు ఇది అమెజాన్‌లో రూ.18,750కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Samsung Galaxy A32 స్పెసిఫికేష‌న్లు:
 

Samsung Galaxy A32 స్పెసిఫికేష‌న్లు:

Samsung Galaxy A32 4G స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. ఇది 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్ తో, 6.4-అంగుళాల సూపర్ AMOLED FHD+ ఇన్ఫినిటీ-U డిస్‌ప్లే క‌లిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో ప‌ని చేస్తుంది. MediaTek Helio G80 CPU తో పాటుగా, 8GB RAM మరియు 128GB ఇట‌ర్న‌ల్ స్టోరేజ్ ఈ ఫోన్‌కు అందిస్తున్నారు. మైక్రో SD కార్డ్ పోర్ట్ 1TB స్టోరేజీ వ‌ర‌కు ఎక్స్‌ప్యాండ్ చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. Android 12 ఆధారంగా One UI 4.1 పై ర‌న్ అవుతుంది.

ఇక కెమెరాల విష‌యానికొస్తే.. ఈ మొబైల్‌కు బ్యాక్‌సైడ్ నాలుగు కెమెరాల సెట‌ప్ అందించారు. f/1.8 ఎపర్చర్‌తో 64MP ప్రధాన లెన్స్ ను క‌లిగి ఉంది. ఇక రెండోది, 123-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు మిగ‌తా రెండు f/2.4 5MP మాక్రో మరియు డెప్త్ సెన్సార్‌లు గా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ వైపు 20MP f/2.2 సెల్ఫీ కెమెరా ఇచ్చారు. USB-C మరియు 3.5mm ఆడియో జాక్ కనెక్షన్‌లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4G LTE, Wi-Fi 5GHz, బ్లూటూత్ 5.0, GPS, Samsung's Knox Security, AltZLife ఫీచ‌ర్ల‌ను కల్పించారు. ఛార్జింగ్ కోసం 5,000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో ఉంది.

పండ‌గ సీజ‌న్ ప్రారంభం:

పండ‌గ సీజ‌న్ ప్రారంభం:

భార‌త్‌లో పండ‌గ సీజ‌న్ ప్రారంభం అవుతుండ‌టంతో చాలా కంపెనీలు ప్ర‌త్యేక ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. మ‌రోవైపు, ఈ కామ‌ర్స్ కంపెనీలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సైతం త‌మ ఫెస్టివ‌ల్ సేల్ తేదీల‌ను ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి.

Amazonలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివ‌ల్ సేల్ ఎప్పుడంటే!
ప్ర‌ముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పండ‌గ సీజ‌న్ సంద‌ర్భంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌తో తిరిగి వచ్చింది. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుండి భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం కానుందని అమెజాన్ తన ప్లాట్‌ఫారమ్‌లో అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సేల్ ఎన్ని రోజులు కొనసాగుతుంది అనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. ఎప్పుడు మొదలవుతుందో మాత్రమే తేదీని వెల్లడించారు. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గేమింగ్ డివైజ్‌లు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించారు.

వారం రోజుల పాటు Flipkart Big Billion Days 2022 సేల్‌!

వారం రోజుల పాటు Flipkart Big Billion Days 2022 సేల్‌!

ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్-2022 (Flipkart Big Billion Days 2022) సేల్ సెప్టెంబ‌ర్ 23 వ తేదీన ప్రారంభ‌మై సెప్టెంబ‌ర్ 30 వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. దాదాపు వారం రోజుల పాటు సాగ‌నుంది. ఈ సేల్‌లో భాగంగా ప‌లు ఉత్త‌మ బ్రాండ్ల‌కు చెందిన అనేక ఉత్ప‌త్తుల‌పై బెస్ట్ డిస్కౌంట్లు కొనుగోలుదారుల‌కు అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్ 23 మరియు సెప్టెంబర్ 30 మధ్య జరిగే బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్ సమయంలో, వినియోగదారులు 12 AM, 8 AM మరియు 4 PMకి "క్రేజీ డీల్స్" పొందవచ్చు. అదేవిధంగా, ఎర్లీ బర్డ్ స్పెషల్స్‌తో రష్ అవర్స్ సేల్ కూడా ఉంటుంది మరియు టిక్ టాక్ డీల్స్ కూడా ఉంటాయి.

Best Mobiles in India

English summary
Price cut on samsung galaxy A32 smartphone, see here for more details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X