Home
Deal of the day

50MP + 50MP + 50MP కెమెరాలు, 7000mAh బ్యాటరీ ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్!

రియల్‌మి 15 సిరీస్‌ భారత్‌ మార్కెట్‌లో గత సంవత్సరం జులై నెలలో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో రియల్‌మి 15, రియల్‌మి 15 ప్రో 5G మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రో మోడల్‌ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. 50MP సెల్ఫీ కెమెరా, 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్‌ను కలిగి ఉంది.

రియల్‌మి 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.33999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.35999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.38999 గా ఉంది.

Realme 15 Pro 5G phone with triple 50MP Cameras  7000mAh Battery gets Rs3000 discount on flipkart

రూ.3000 డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. 128GB స్టోరేజీ వేరియంట్‌ ప్రస్తుతం అందుబాటులో లేదు. మిగిలిన వేరియంట్స్‌పై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ ఫోన్‌ ఫ్లోయింగ్ సిల్వర్‌, సిల్క్‌ పర్పుల్, వెల్‌వెట్ గ్రీన్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

144Hz రీఫ్రెష్‌ రేట్‌ :
రియల్‌మి 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 6500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 2500Hz ఇన్‌స్టంట్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 12GB LPDDR4x ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6 పనిచేస్తోంది. 3 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP + 50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 50MP సోనీ MX896 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ మూడు కెమెరాలతో 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి. AI Snap Mode, AI LandScape, AI Motion Control, AI Magic Glow 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు గేమింగ్ కోచ్‌ 2.0, GT బూస్ట్‌ 3.0 టెక్నాలజీ కూడా ఉంది.

7000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ ఉంది. IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. 5G, 4G, Wi-Fi, బ్లూటూత్‌ 5.4, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 15 Pro 5G phone with triple 50MP Cameras, 7000mAh Battery gets Rs3000 discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X