Home
Deal of the day

7000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలు, 6.8 అంగుళాల డిస్‌ప్లే ఫోన్‌పై డిస్కౌంట్‌..!

భారత్‌ మార్కెట్‌లో ఇవాళ రియల్‌మి 16 ప్రో సిరీస్‌ విడుదల కానుంది. ఈ సిరీస్‌ లో రియల్‌మి 16 ప్రో, రియల్‌మి 16 ప్రో ప్లస్‌ ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. అయితే ఇప్పటికే రియల్‌మి అనేక స్మార్ట్‌ఫోన్‌ లను 2025 సంవత్సరంలో విడుదల చేసింది. 2025 అక్టోబర్‌ లో రియల్‌మి 15x 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఈ ఫోన్‌ బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి వచ్చినా.. భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతోపాటు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.

ధర, ఆఫర్ల వివరాలు :
రియల్‌మి 15x 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme 15x 5G Smartphone) ప్రస్తుతం రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19499, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.20,999 గా ఉంది.

Realme 15x 5G sale

రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌ లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1500 డిస్కౌంట్‌ ను అందిస్తోంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ ఆక్వా బ్లూ, మెరైన్‌ బ్లూ, మెరూన్‌ రెడ్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెన్స్‌ :
రియల్‌మి 15x 5G స్మార్ట్‌ఫోన్‌ ఆర్మల్‌ షెల్‌ తో కూడిన మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెన్స్‌ సపోర్టును కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1200 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
రియల్‌మి ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ARM Mali G57 MC2 GPU ను కూడా అమర్చారు. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్‌ OS, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

Realme 15x 5G sale

రెండు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX852 కెమెరా, 50MP AI సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ అండర్‌ వాటర్‌ ఫీచర్‌, స్లో మోషన్, టైమ్‌ ల్యాప్స్‌, సినిమాటిక్‌ మోడ్‌, డ్యూయల్‌ వ్యూ వీడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. IP69 రేటింగ్ డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

7000mAh బ్యాటరీ, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ :
రియల్‌మి 15x 5G స్మార్ట్‌ఫోన్ 60W SUPERVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాంబియంట్‌ లైట్‌, ప్రాక్సిమిటీ, ఇ-కంపాస్‌, యాక్సెలిరోమీటర్‌ను కలిగి ఉంది. నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సపోర్టు డ్యూయల్‌ మైక్‌తో స్పీకర్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 15x 5G Smartphone with 7000mAh Battery, 50MP Selfie gets Rs1500 discount in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X