Home
Deal of the day

రూ.15 వేల ధరలో ఫోన్‌ కోసం చూస్తున్నారా.. 7000mAh భారీ బ్యాటరీ, 6.8 అంగుళాల డిస్‌ప్లేతో..!

రియల్‌మి సంస్థ భారత్‌ మార్కెట్‌ లో ఇటీవల బడ్జెట్‌ ధరలో భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రియల్‌మి C85 5G ఫోన్‌ను తీసుకొచ్చింది. రూ.15 వేల ధరలో మీరు లేటెస్ట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తే ఈ ఫోన్‌ను మీరు పరిశీలించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది. బడ్జెట్‌ ధరలోనే 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

రియల్‌మి C85 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme C85 5G Smartphone) ప్రస్తుతం రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15,499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16,999 గా ఉంది. కూపన్‌ కోడ్‌ తో రూ.500 తగ్గింపును పొందవచ్చు. ప్యారెట్‌ పర్పుల్‌, పికాక్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

realme C85 5G Smartphone pricedrop

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ :
ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు IP69 ప్రో రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. రియల్‌మి తెలిపిన వివరాల ప్రకారం ఏకంగా 36 రకాల లిక్విడ్స్‌ నుంచి రక్షణ పొందుతుందని చెబుతోంది. మరియు 6 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాలపాటు ఉన్నా డ్యామేజీ కాదని సంస్థ తెలిపింది.

భారీ డిస్‌ప్లే :
ఈ స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 1200 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది.

మీడియాటెక్‌ చిప్‌సెట్ :
రియల్‌మి C85 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు ARM Mail G57 MC2 GPU ను కూడా అమర్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది. 4GB/128GB, 6GB/128GB వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

50MP కెమెరా, 7000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు 50MP సోనీ IMX852 కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి వచ్చినా ఈ హ్యాండ్‌సెట్‌ 45W SuperVOOC వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 5300 Sq mm వేపర్‌ ఛాంబర్‌ ను కలిగి ఉంది. ఫలితంగా మల్టీ టాస్కింగ్‌ సహా ఇతర సందర్భాల్లో వేడెక్కుండా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్‌ 5.2, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఇ-కంపాస్‌, యాంబియంట్‌ లైట్ సెన్సర్‌, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ సెన్సర్‌, కలర్‌ టెంపరేచర్‌ సెన్సర్‌లు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
realme C85 5G Smartphone with 7000mAh battery and 50MP sony camera gets Rs500 coupon code
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X