50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లే ఫోన్ పై రూ.2000 తగ్గింపు..!
రియల్‌మి గత సంవత్సరం నార్జో 70 టర్బో ఫోన్‌ను (Realme Narzo 70 Turbo Smartphone) లాంచ్ చేసింది. బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. మరియు 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు 50MP కెమెరాను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తోంది. 6GB ర్యామ్ + 128GB స్చోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో ఉంది. టర్బో ఎల్లో, టర్బో గ్రే, టర్బో గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది.

ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.14998 గా ఉంది. రూ.1500 కూపన్ డిస్కౌంట్ ద్వారా తగ్గింపును పొందవచ్చు. 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.16498 గా ఉంది. ఈ వేరియంట్‌ను రూ.2000 కూపన్ డిస్కౌంట్ ద్వారా తగ్గింపును పొందవచ్చు.
రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల (1080*2400 పిక్సల్) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 7.6mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్ తో పనిచేస్తోంది. మరియు Mali G615 GPU ను కూడా కలిగి ఉంది. మీడియాటెక్ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంది.
ఈ రియల్‌మి ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP AI ప్రైమరీ కెమెరా, 2MP పొర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం స్టెయిన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కూడా కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ డిస్‌ప్లే రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.
ఈ ఫోన్ 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు సహా యాక్సెలిరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, మాగ్నటిక్ ఇండక్షన్ సెన్సార్, గైరో మీటర్ వంటి సెన్సార్‌లను కూడా కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఈ హ్యాండ్‌సెట్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications