Home
Deal of the day

రూ.10748 ధరకే 6000mAh బ్యాటరీ, ఎయిర్‌బ్యాగ్‌ స్టైల్‌ షాక్‌ రెసిస్టెంట్‌ 5G ఫోన్‌..!

రియల్‌మి ఈ సంవత్సరం అనేక మోడల్స్‌ ను లాంచ్‌ చేసింది. ఇందులో P3, P4 సిరీస్‌తోపాటు రియల్‌మి 15 సిరీస్‌ విడుదల అయింది. వీటితోపాటు నార్జో సిరీస్‌ మోడల్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ సంవత్సరం జూన్‌ నెలలో రియల్‌మి నార్జో 80 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ( Realme Narzo 80 Lite 5G Smartphone ) విడుదల అయింది. ఈ ఫోన్ 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు ఆర్మర్‌ షెల్‌ టఫ్‌ బిల్ట్‌ ఫీచర్‌ ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉంది.

ఈ వేరియంట్‌పై డిస్కౌంట్‌ :
రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10,499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11,499 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌ లో ఈ ఫోన్ 6GB/128GB వేరియంట్‌ను రూ.10748 ధరకు కొనుగోలు చేయవచ్చు.

Realme narzo 80 lite 5G smartphone

రెయిన్‌ వాటర్‌ స్మార్ట్ టచ్‌ ఫీచర్‌ :
రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 625 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే రెయిన్‌ వాటర్‌ స్మార్ట్ టచ్‌ ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. తడి చేతులతోనూ ఈ ఫోన్‌ వినియోగించుకోవచ్చు.

కిందపడిన డ్యామేజీ కాకుండా :
ఈ ఫోన్‌ ఆర్మర్‌ షెల్‌ టఫ్‌ బిల్ట్‌ ఫీచర్‌ ను కలిగి ఉంది. ఈ ఫీచర్‌ ఎయిర్‌బ్యాగ్‌ స్టైల్‌ షాక్‌ రెసిస్టెంట్‌ గా పనిచేస్తుంది. ఈ కారణంగా స్మార్ట్‌ఫోన్‌ పొరపాటున కిందపడినా డ్యామేజీ కాకుండా ఉంటుంది. ఈ ఫోన్ ఓనిక్స్‌ బ్లాక్, క్రిస్టల్‌ పర్పుల్‌ కలర్ వేరియంట్స్‌ లో అందిస్తోంది.

Realme narzo 80 lite 5G smartphone

6000mAh భారీ బ్యాటరీ :
ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 15W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే ఈ ఫోన్‌ 5W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంది.

32MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 32MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో లెన్స్‌ కూడా ఉంటుంది. మరియు LED ఫ్లాష్ లైట్‌ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంది.

ఈ రియల్‌మి నార్జో 80 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. గూగుల్‌ జెమిని వంటి ఏఐ ఫీచర్‌లు ఉన్నాయి. 5G, 4G, బ్లూటూత్, Wi-Fi USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme narzo 80 lite 5G smartphone now available at Rs10748 price on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X