8GB ర్యామ్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.2500 తగ్గింపు.. పూర్తి వివరాలు..!
దీపావళి సందర్భంగా అమెజాన్ ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీవాళీ ప్రత్యేక సేల్ పేరుతో (Amazon Great Indian Festival Diwali Special Sale 2024) అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్ ధరలకు అందిస్తోంది. ప్రస్తుతం ఈ సేల్‌లో భాగంగా రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎటువంటు బ్యాంకు కార్డులు అవసరం లేకుండా.. కూపన్ కోడ్ ద్వారా గరిష్ఠంగా రూ.2500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే బ్యాంకు కార్డులతో మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు పూర్తి వివరాలు.
రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్ (Realme Narzo N65 5G Smartphone Discount Offer) ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

విడుదల సమయంలో 4GB ర్యామ్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్ లో కూపన్ కోడ్ డిస్కౌంట్ ద్వారా రూ.750 తగ్గింపుతో రూ.9,749 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే 6GB ర్యామ్ వేరియంట్ పై రూ.2250 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
8GB ర్యామ్ వేరియంట్ పై రూ.2500 తగ్గింపును పొందవచ్చు. డిస్కౌంట్ అనంతరం ధరలు రూ.10248, రూ.10,998 గా ఉంది. అమెజాన్‌లో రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్ ను అమెజాన్ లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 625 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 89.97 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియోను కలిగి ఉంది.
రియల్‌మి నార్జో N65 5G ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OSతో పనిచేస్తుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా 12GB వరకు ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు. మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
కెమెరా విభాగం పరంగా నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను అమర్చి ఉంటుంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. క్విచ్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా 28 రోజుల స్టాండ్‌బై టైంను పొందవచ్చని సంస్థ తెలిపింది.
రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్ మిని క్యాప్సుల్ 2.0, స్మార్ట్ టచ్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మిని క్యాప్సుల్ ద్వారా ముఖ్యమైన నోటిఫికేషన్‌లను పొందవచ్చు. అలాగే స్మార్ట్ టచ్ ఫీచర్ ద్వారా తడి చేతులతోనూ స్మార్ట్‌ఫోన్ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. IP54 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








