చీకట్లో మెరిసే స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.8000 తగ్గింపు.. 6000mAh బ్యాటరీ, 6.83 అంగుళాల భారీ డిస్‌ప్లే సహా!
Realme P3 Ultra 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి ఈ సంవత్సరం తొలిభాగంలో భారత్‌లో రియల్‌మి P3 సిరీస్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ భారీ డిస్‌ప్లే, కూలింగ్ సిస్టమ్, ఏఐ ఫీచర్లు తోపాటు గ్లోయింగ్ లూనార్ డిజైన్ ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.26999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.27,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.29,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025 లో (Flipkart Big Bang Diwali 2025) భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

రూ.8 వేల డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 8GB/256GB ధర రూ.19999 గా ఉంది. అంటే ఏకంగా రూ.8 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే 12GB/256GB వేరియంట్ ధర రూ.24999 గా ఉంది. అంటే రూ.5 వేల డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ బేస్ వేరియంట్ రూ.20999 గా ఉంది.
గ్లోయింగ్ లూనార్ డిజైన్ :
రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకమైన ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ గ్లోయింగ్ లూనార్ డిజైన్‌తో అందుబాటులో ఉంది. అంటే చీకట్లో ఈ హ్యాండ్‌సెట్ బ్యాక్ ప్యానల్ మెరుగుస్తుంది. దీంతోపాటు లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంది.
6.83 అంగుళాల భారీ డిస్‌ప్లే :
రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.83 అంగుళాల 1.5K క్వాడ్ కర్వడ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రెయిన్ వాటర్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ 7.38mm స్లిమ్ డిజైన్ తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ గ్లోయింగ్ లూనార్ వైట్, నెప్ట్యూన్ బ్లూ, ఓరియన్ రెడ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఈ రియల్‌మి అల్ట్రా మోడల్ ఫోన్ మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 6050mm Sq ఏరోస్పేస్ గ్రేడ్ VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్ సహా ఎక్కువ సమయం ఉపయోగించిన సమయాల్లో ఈ ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది.
50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాలను అమర్చి ఉంది. 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 80W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. AI అల్ట్రా టచ్ కంట్రోల్, AI మోషన్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








