6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6.83 అంగుళాల డిస్‌ప్లే 5G ఫోన్‌పై రూ.4000 తగ్గింపు..!
రియల్‌మి నుంచి ఇటీవల భారత్ మార్కెట్ లో రియల్‌మి 16 ప్రో సిరీస్ లాంచ్ అయింది. ఏకంగా 200MP కెమెరాను కలిగి ఉంది. ఆకట్టుకొనే డిజైన్ తో అందుబాటులోకి వచ్చింది. అయితే గత సంవత్సరం రియల్‌మి P3 సిరీస్ లో భాగంగా రియల్‌మి P3 అల్ట్రా 5G ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
రూ.4000 డిస్కౌంట్ :
రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ (Realme P3 Ultra 5G Smartphone) భారత్ మార్కెట్ లో విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.26999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.22999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.4 వేల డిస్కౌంట్ ను పొందవచ్చు.

విడుదల సమయంలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.27,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.24499 గా ఉంది. అంటే రూ.3500 డిస్కౌంట్ ను పొందవచ్చు. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.29,999 గా ఉండేది. ప్రస్తుతం రూ.4 వేల డిస్కౌంట్ తో రూ.25999 కే కొనుగోలు చేయవచ్చు.
డిస్‌ప్లే వివరాలు :
రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.83 అంగుళాల 1.5K క్వాడ్ కర్వడ్ OLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 2500Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ గ్లోయింగ్ లూనార్ డిజైన్ ఫీచర్ కారణంగా చీకట్లో మెరుగుస్తుంది.
3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాలున్నాయి. ఈ ఫోన్ 80W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
IP66+ IP68+ IP69 రేటింగ్ :
ఈ హ్యాండ్‌సెట్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 6050 mm Sq ఏరోస్పేస్ గ్రేడ్ VC కూలింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ AI అల్ట్రా టచ్ కంట్రోల్, AI మోషన్ కంట్రోల్, GT బూస్ట్ గేమింగ్ ఫీచర్లు ఉన్నాయి. IP66 + IP68 + IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.


Click it and Unblock the Notifications








