Home
Deal of the day

రూ.11 వేల కంటే తక్కువ ధరలో 5G ఫోన్‌ కోసం చూస్తున్నారా.. 6000mAh బ్యాటరీ, ఫుల్‌ HD డిస్‌ప్లే, 50MP కెమెరా!

భారత్‌లో రియల్‌మి P3 సిరీస్‌ ఈ సంవత్సరంలో తొలి భాగంలో విడుదల అయింది. ఇందులో భాగంగా రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్ సహా మరిన్ని మోడల్స్‌ లాంచ్‌ అయ్యాయి. దీంతోపాటు ఇటీవలే రియల్‌మి p4 సిరీస్‌ కూడా విడుదల అయింది. అయితే రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, IP69 రేటింగ్‌ వంటి అనేక బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. రూ.10 వేల ధరలో ఫోన్‌ కోసం చూస్తుంటే ఈ హ్యాండ్‌సెట్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు!.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్‌ దీపావళి సేల్‌ :
రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14,999 గా ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్‌ దీపావళి 2025 సేల్‌లో (Flipkart Big Bang Diwali 2025 Sale) భాగంగా భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Realme P3x 5G smartphone pricedrop

రూ.2500 డిస్కౌంట్ తోపాటు :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ (Realme P3x 5G Smartphone) 6GB/128GB వేరియంట్‌ ధర రూ.11499, 8GB/128GB వేరియంట్ ధర రూ.12499 గా ఉంది. అంటే రూ.2500 డిస్కౌంట్ ను పొందవచ్చు. దీంతోపాటు SBI బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

వేగాన్‌ లెదర్ ఫినిష్‌, మూడు కలర్‌ వేరియంట్స్ :
అంటే బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1200 అదనపు తగ్గింపును పొందవచ్చు. దీంతో సుమారు రూ.10 వేల ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ లూనార్‌ సిల్వర్‌, మిడ్‌నైట్‌ బ్లూ, స్టెల్లర్‌ పింక్ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ను కలిగి ఉంది.

Realme P3x 5G smartphone pricedrop

రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల FHD LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెంట్‌గా ఉంది. IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. మంచి నీటిలో పూర్తిగా మునిగినా డ్యామేజీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.

6000mAh బ్యాటరీ :
ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS తో పనిచేస్తోంది. ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ధర సెగ్మెంట్‌లో బెస్ట్‌ బ్యాటరీ ఫోన్‌గానే పరిగణించవచ్చు.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలున్నాయి. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 5G, 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్‌ 5.3, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P3x 5G smartphone now available At Rs11499 price on flipkart big bang diwali 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X