7000mAh బ్యాటరీ, 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, AI ఫీచర్ల 5G ఫోన్ పై రూ.2500 డిస్కౌంట్!
Realme P4 5G Smartphone : రియల్‌మి భారత్ మార్కెట్‌లో ఈ సంవత్సరం ఆగస్టు నెలలో రియల్‌మి P4 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా రియల్‌మి P4, రియల్‌మి P4 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళీ 2025 లో భాగంగా రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీ, అమోలెడ్ డిస్‌ప్లే, 50MP కెమెరాను కలిగి ఉంది.
విడుదల సమయంలో రియల్‌మి P4 హ్యాండ్‌సెట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18499 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ దీపావళి 2025 సేల్‌లో (Flipkart Big Bang Diwali Sale 2025) భాగంగా రూ.15999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.2500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19499 గా ఉండేది. ఈ సేల్‌లో భాగంగా రూ.16999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ వేరియంట్ పైనా రూ.2500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.21499 గా ఉండేది. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో భాగంగా రూ.18999 కే కొనుగోలు చేయవచ్చు.
బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్ :
అంటే ఈ వేరియంట్ పైనా రూ.2500 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతోపాటు SBI బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ ఇంజిన్ బ్లూ, పోర్జ్ రెడ్, స్టీల్ గ్రే కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని రియల్‌మి హామీ ఇచ్చింది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను అమర్చారు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ అనేక ఏఐ ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఈ జాబితాలో AI Edit, AI Party Mode, AI Text Scanner, AI Land Scape ఫీచర్లు ఉన్నాయి.
హైపర్ విజన్ AI చిప్ :
ఈ ఫోన్ మెరుగైన రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్ కోసం హైపర్ విజన్ AI చిప్‌ను కూడా కలిగి ఉంది. దీంతోపాటు మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. IP65, IP66 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, Wi-Fi 6, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








