బడ్జెట్ ధరలో 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, హైపర్ విజన్ చిప్ తో 5G స్మార్ట్‌ఫోన్..!
Realme P4 5G Smartphone : రియల్‌మి సంస్థ భారత్ మార్కెట్ లో అనేక స్మార్ట్‌ఫోన్ లను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది. అమోలెడ్ డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, సేల్ పూర్తి వివరాలు.
డిస్కౌంట్ ధరకు :
రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. విడుదల ధరతో పోలిస్తే డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.20999 గా ఉంది.

IP65 + IP66 రేటింగ్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ రియల్‌మి ఫోన్ ఇంజిన్ బ్లూ, పోర్జ్ రెడ్, స్టీల్ గ్రే కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ IP65 + IP66 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
అమోలెడ్ డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ :
రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్ తో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
మీడియాటెక్ చిప్, హైపర్ విజన్ చిప్ :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ హైపర్ విజన్ చిప్ ను కూడా అమర్చి ఉంది. ఈ చిప్ రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్ ను మెరుగుపరుస్తుందని రియల్‌మి తెలిపింది.

50MP ప్రైమరీ, 16MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాలున్నాయి. ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ AI Party Mode, AI Text Scanner, AI Edit, AI Travel Snap, AI LandScape వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి.
కూలింగ్ సిస్టమ్ :
ఈ ఫోన్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం VC కూలింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది. ఫలితంగా ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా రియల్‌మి 5G, 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అమర్చారు.


Click it and Unblock the Notifications








