Home
Deal of the day

7000mAh బ్యాటరీ, రెండు చిప్‌లు, 50MP కెమెరా 5G ఫోన్‌పై డిస్కౌంట్‌..! పూర్తి వివరాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి భారత్‌ మార్కెట్‌లో గత నెలలో రియల్‌మి P4 సిరీస్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో రియల్‌మి P4, P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2025 సేల్‌లో భాగంగా భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్‌ 2 వ తేదీ వరకు మాత్రమే ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌ అందుబాటులో ఉంటుంది.

నెల వ్యవధిలోనే డిస్కౌంట్‌ :
భారత్‌ మార్కెట్‌లో విడుదల సమయంలో రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme P4 5G Smartphone) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18499 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే కేవలం నెల వ్యవధిలోనే రూ.1500 ధర తగ్గింది.

Realme P4 5G smartphone specs and features

ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19499, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.21499 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17999, రూ.19999 గా ఉంది. అంటే రూ.1500 డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతోపాటు ICICI, యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 7.58mm థిక్‌నెస్‌ను మాత్రమే కలిగి ఉంది. మెటర్‌ హార్ట్‌ డిజైన్‌తో అందుబాటులో ఉంది.

హైపర్‌ విజన్ AI :
ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మెరుగైన రిజల్యూషన్‌, ఫ్రేమ్‌ రేట్‌ కోసం ఈ ఫోన్‌ హైపర్‌ విజన్‌ AI చిప్‌ ను కూడా అమర్చినట్లు రియల్‌మి చెబుతోంది.

Realme P4 5G smartphone specs and features

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 తో పనిచేస్తోంది. దీంతోపాటు మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP కెమెరా సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌ AI Text Scanner, AI Party Mode, AI Edit, AI Land Scape వంటి ఏఐ ఫీచర్లున్నాయి.

7000mAh భారీ బ్యాటరీ :
ఈ స్మా్ర్ట్‌ఫోన్ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 10W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ IP65, IP66 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్‌ భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్ సన్సర్‌ను కలిగి ఉంది. 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్‌ 5.4, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P4 5G smartphone with 7000mAh Battery smartphone gets discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X