రూ.2000 డిస్కౌంట్.. 7000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా, 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే 5G ఫోన్..!
రియల్‌మి P4 సిరీస్ ఆగస్టు నెలలో భారత్ లో విడుదల అయింది. ఇందులో P4, P4 ప్రో 5G ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. రియల్‌మి P4 5G హ్యాండ్‌సెట్ ఇటీవలే డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి రాగా... ప్రస్తుతం ప్రో (Realme P4 Pro 5G Smartphone) మోడల్‌ను కూడా డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రో మోడల్ 7000mAh బ్యాటరీ, 144Hz రీఫ్రెష్ రేట్, కూలింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.
ఆగస్టు నెలలో తొలి సేల్ ప్రారంభం అయ్యే సమయంలో రియల్‌మి P4 ప్రో 5G ఫోన్ ధర 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.24999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.28999 గా ఉండేది.

10 శాతం అదనపు డిస్కౌంట్ :
ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2000 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఫలితంగా ఈ ఫోన్ ధరలు రూ.22999, రూ.24999, రూ.26999 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఫలితంగా మరింత తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తోంది.
ఈ ఫోన్ లో మెరుగైన గేమ్ ప్లే, ఫ్రేమ్ రేట్ కోసం Hyper Vision చిప్‌ను అదనంగా జోడించారు. ఈ ఫోన్ BGMI 144fps ను సపోర్టు చేస్తుంది. మరియు మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 7000 Sq mm ఎయిర్‌ఫ్లో VC కూలింగ్ సిస్టమ్‌తో అందుబాటులో ఉంది.

భారీ డిస్‌ప్లే :
ఈ ఫోన్ 6.8 అంగుళాల FHD+ అమోలెడ్ 4D కర్వ్+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ డార్క్ ఓక్, బ్రీచ్ వుడ్, మిడ్‌నైట్ ఐవీ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలతో 60fps వద్ద 4K వీడియోలను రికార్టు చేయవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. IP65, IP66 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రిసెస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ AI Snap Mode, AI Landscape, AI Text Scanner, AI Party Mode వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








