రూ.15 వేల ధరలో 7000mAh బ్యాటరీ, 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 50MP కెమెరా 5G ఫోన్..!
భారత్‌లో బడ్జెట్ ధరలో అనేక ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీ, భారీ డిస్‌ప్లే తో రెడ్‌మి 5G ఫోన్ ను తీసుకొచ్చింది. సుమారు రూ.15000 ధర రేంజ్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ (Redmi 15 5G Smartphone) 7000mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ తో పనిచేస్తోంది.
రూ.15 వేల కంటే తక్కువ ధరలో :
రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14998, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.15998, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16998 గా ఉంది. శాండీ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, ఫ్రాస్టెడ్ వైట్ కలర్ వేరియంట్స్ లో లభిస్తోంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
రెడ్‌మి 15 5G ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 తో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని రెడ్‌మి హామీ ఇచ్చింది.
144Hz రీఫ్రెష్ రేట్‌తో భారీ డిస్‌ప్లే :
ఈ రెడ్‌మి ఫోన్ 6.9 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 850 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 288Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. IP64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా (AI), 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. దీంతోపాటు ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ సర్కిల్ టు సెర్చ్, AI Erase, AI Sky, క్లాసిక్ ఫిల్మ్ ఫిల్టర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే Low Blue light, TUV Rheinland Flicker Free, సర్కాడియన్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. IR బ్లాస్టర్ కూడా ఉంది.
7000mAh భారీ బ్యాటరీ :
ఈ రెడ్‌మి హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 18W రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ సపోర్టుతో స్పీకర్లు ఉన్నాయి. 5G, 4G, బ్లూటూత్. Wi-Fi, GPS, USB-c ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications

