Home
Deal of the day

రూ.12 వేల ధర రేంజ్‌లో 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్!

రెడ్‌మి సంస్థ గత నెలలో భారత్‌ మార్కెట్‌ లో ( Redmi India ) రెడ్‌మి 15C 5G స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ రూ.12 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్‌ రేంజ్‌ లో అందుబాటులోకి వచ్చినా భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు 6000mAh బ్యాటరీ, ఏకంగా 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను అందిస్తుంది. రూ.12 వేల ధరలో లేటెస్ట్‌ ఫోన్ల కోసం చూస్తున్న వారికి ఈ హ్యాండ్‌సెట్‌ ఓ ఆప్షన్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్ల వివరాలు.

ధర వివరాలు :
రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్‌ (Redmi 15c 5G Smartphone) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15499 గా ఉంది. ప్రస్తుతం షియోమీ ఇండియా ఇ-స్టోర్‌, అమెజాన్‌ లో ( Amazon ) అందుబాటులో ఉంది.

Redmi 15c 5G smartphone pricedrop

6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే :
రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 810 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ ఫోన్‌ ప్రస్తుతం డస్క్ పర్పుల్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌, మూన్‌ లైట్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతోంది.

Redmi 15c 5G smartphone pricedrop

50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP AI కెమెరా, మరో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందు వైపు 8MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్‌ 33W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్‌ 5G, 4G, Wi-Fi, బ్లూటూత్‌ 5.4, GPS, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌, IR బ్లాస్టర్‌, USB- C ఛార్జింగ్ పోర్టు ఉన్నాయి. ఈ ఫోన్‌ సెక్యురిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్ ఉంది. రూ.12 వేల ధరలో లేటెస్ట్ స్మార్ట్‌ ఫోన్‌ ల కోసం చూస్తున్న వారికి ఈ హ్యాండ్‌సెట్‌ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi 15c 5G smartphone with 6000mAh battery available at Rs12499 price in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X