Home
Deal of the day

ధర రూ.8998 కే 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లే, 128GB స్టోరేజీ, 50MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్..!

భారత్‌ మార్కెట్‌ లో ఎంట్రీ లెవల్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ గా అందుబాటులోకి వచ్చిన రెడ్‌మి A4 5G హ్యాండ్‌సెట్‌ హైఎండ్ వేరియంట్‌ ను ప్రస్తుతం డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 4nm స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 ప్రాసెసర్‌ తో పనిచేస్తోంది. మరియు డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటోంది. వెనుక వైపు గ్లాస్‌ ప్యానల్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం అమెజాన్‌ (Amazon) లో డిస్కౌంట్‌ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం నిర్వహించిన ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2024 సదస్సు తొలిసారిగా ఈ హ్యాండ్‌సెట్‌ ను ఆవిష్కరించారు.

భారత్‌లో రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్‌ (Redmi A4 5G Smartphone Discount on Amazon) 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,498, 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,498 గా ఉంది. హైఎండ్‌ వేరియంట్‌ ను కూపన్‌ డిస్కౌంట్‌ ద్వారా రూ.500 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా హ్యాండ్‌సెట్‌ ధర రూ.8998 కే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్‌ చేయండి.

redmi a4 5g smartphone amazon sale

రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్‌ వివరాలు :
రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్‌ (Redmi A4 5G Smartphone Specs) 6.88 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ ను కలిగి ఉంది. స్పార్కల్‌ పర్పుల్, స్టారీ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 ప్రాసెసర్‌ :
ఈ రెడ్‌మి 5G హ్యాండ్‌సెట్‌ 4nm స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 ప్రాసెసర్‌ తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్‌ 4GB LPDDR4X ర్యామ్‌ మరియు 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది.

redmi a4 5g smartphone amazon sale

4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు :
రెడ్‌మి ఎంట్రీ లెవల్‌ 5G హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌ లు. 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను పొందుతుందని షియోమీ హామీ ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ హై ఎండ్‌ మోడల్‌ స్టోరేజీ 128GB గా ఉంది. అయితే మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.

50MP కెమెరా, 5160mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా మరో సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. రెడ్‌మి A4 5G హ్యాండ్‌సెట్ 18W ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5160mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.

కనెక్టివిటీ పరంగా రెడ్‌మి హ్యాండ్‌సెట్‌ 5G, 4G LTE, బ్లూటూత్ 5.0, Wi-Fi 5, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టుతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ స్కానర్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు IP52 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
redmi a4 5g smartphone 128GB storage variant gets price cut on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X