42 గంటల బ్యాటరీ లైఫ్, ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్, 49dB ANC సపోర్టుతో ఇయర్‌బడ్స్.. అమెజాన్‌లో సేల్
రెడ్‌మి బడ్స్ 6 ఇయర్‌బడ్స్ గత నెలలో భారత్ మార్కెట్లో విడుదల అయ్యాయి. ఈ బడ్స్ రూ.3000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 42 గంటలపాటు వినియోగించుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ 49dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ బడ్స్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధర పూర్తి వివరాలు.
రెడ్‌మి బడ్స్ 6 ధర సేల్ వివరాలు :
రెడ్‌మి బడ్స్ 6 (Redmi Buds 6 Earbuds) డిజైన్ ఆకట్టుకుంటోంది. భారత్ మార్కెట్ లో ఈ బడ్స్ ధర రూ.2999 గా ఉంది. టైటాన్ వైట్, ఐవీ గ్రీన్, స్పెక్టర్ బ్లాక్ రంగుల్లో లభిస్తోంది. అమెజాన్ లో ఈ రెడ్‌మి బడ్స్ 6 ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.

రెడ్‌మి బడ్స్ 6 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రెడ్‌మి బడ్స్ సిలికాన్ ఇయర్ టిప్స్‌తో కూడిన ఇన్ ఇయర్ డిజైన్ ను కలిగి ఉన్నాయి. విండ్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీతో కూడిన AI ఆధారిత డ్యూయల్ మైక్రోఫోన్ సిస్టమ్ ను సపోర్టు చేస్తాయి. ఈ బడ్స్ 12.4 mm టైటానియం డ్రైవర్‌లతోపాటు 5.5mm మైక్రో పీజో ఎలక్ట్రిక్ సిరామిక్ యూనిట్లను కలిగి ఉంది.
డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ, ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్‌లు..
ఈ బడ్స్ డ్యూయల్ డివైస్ కనెక్టివిటీతో కూడిన బ్లూటూత్ 5.4 ను కలిగి ఉంది. ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. అంటే చెవి నుంచి బడ్స్‌ను తీసిన వెంటనే ఆఫ్ కానున్నాయి. షియోమీ ఇయర్‌బడ్స్ యాప్ తో ఈ బడ్స్ ను కనెక్ట్ చేయవచ్చు.
లో లేటెన్సీ, 49dB ANC ఫీచర్ :
ఈ రెడ్‌మి బడ్స్ 6 బడ్స్ మెరుగైన ఆడియో కోసం 49dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్టును కలిగి ఉన్నాయి. దీంతోపాటు 60ms లో లేటెన్సీ ని కలిగి ఉంటాయి. ఫలితంగా గేమింగ్, స్ట్రీమింగ్ సమయంలో మెరుగైన అనుభూతిని పొందవచ్చు.
ఇయర్‌బడ్స్ కొనుగోలు చేసే సమయంలో ఎక్కువ మంది బ్యాటరీ లైఫ్ ను కూడా దృష్టిలో పెట్టుకుంటారు. అయితే ఈ బడ్స్ 475mAh బ్యాటరీ సపోర్టును కలిగి ఉంది. ఈ బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 42 గంటలపాటు ఉపయోగించుకోవచ్చు. కేవలం 10 నిమిషాల క్విక్ ఛార్జింగ్‌తో 4 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైం ను పొందవచ్చు.
IP54 రేటింగ్, USB- C ఛార్జింగ్ పోర్టు :
ఈ బడ్స్ USB-C ఛార్జింగ్ పోర్టు, LED లైట్‌ను కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెన్స్‌గా ఉంది. అమెజాన్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం రూ.3000 కంటే తక్కువ ధరలో మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉన్నట్లు భావించవచ్చు. లాంగ్ డ్రైవ్, వర్కౌట్స్ సమయాల్లో వినియోగించుకొనేందుకు ఈ బడ్స్ అనుకూలంగా ఉంటాయి.


Click it and Unblock the Notifications








