Home
Deal of the day

200MP కెమెరా, 8GB ర్యామ్‌, 67W టర్బో ఛార్జ్ సపోర్టు స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. అమెజాన్‌లో సేల్‌

రెడ్‌మి నోట్ 14 సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ డిసెంబర్‌ 9 వ తేదీన భారత్‌ మార్కెట్‌ లో విడుదల కానుంది. దీంతోపాటు ఈ సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ ల కొన్ని స్పెసిఫికేషన్‌ ల వివరాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో రెడ్‌మి నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ను (Redmi Note 13 Pro Smatrtphone) డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 1.5K రిజల్యూషన్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 67W టర్బో ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.

రెడ్‌మి నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ వేరియంట్‌లు :
రెడ్‌మి నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (Redmi Note 13 Pro Amazon Sale Offer) ప్రస్తుతం 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. మరియు ఆర్కిటిక్‌ వైట్‌, కోరల్‌ పర్పుల్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌, స్కార్‌లెట్ రెడ్ వంటి నాలుగు రంగుల్లో లభిస్తుంది.

Redmi Note 13 Pro 5G Smartphone

రెడ్‌మి నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ధర :
అమెజాన్‌లో ప్రస్తుతం 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.18,568 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ రూ.20,189 గా ఉంది. అదే 12GB ర్యామ్ వేరియంట్‌ ధర రూ.21,599 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను పొందవచ్చు. రెడ్‌మి నోట్‌ 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్‌ చేయండి.

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
రెడ్‌మీ నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల 1.5k కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను పొందుతుంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో అందుబాటులో ఉంది.

Redmi Note 13 Pro 5G Smartphone

67W టర్బో ఛార్జ్‌ సపోర్టు :
రెడ్‌మీ నోట్‌ 13 ప్రో హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MIUI 14 OS ను కలిగి ఉంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ Adreno A710 GPU తో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్ 67W టర్బో ఛార్జ్‌ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

200MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలేజైషన్‌) సపోర్టుతో 200MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌, 2MP మాక్రో కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌ సెట్‌ 16MP కెమెరాతో అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Redmi Note 13 Pro 5G Smartphone gets price discount on amazon november 2024 full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X