Home
Deal of the day

అసలు ఊహించని ఆఫర్‌.. కేవలం రూ.12999 కే 50MP కెమెరా, 5110mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మి ఈ సంవత్సరం ఆగస్టు నెలలో రెడ్‌మి నోట్‌ 14 SE 5G స్మా్ర్ట్‌ఫోన్‌ ను విడుదల చేసింది. ఫోన్ ఫుల్ HD+ సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5110mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను కూడా అందిస్తోంది. అత్యంత తక్కువ సమయంలోనే ఈ ఫోన్‌ డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చింది.

భారత్‌ మార్కెట్‌లో రెడ్‌మి నోట్‌ 14 SE 5G స్మార్ట్‌ఫోన్‌ (Redmi Note 14 SE 5G Smartphone) విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉండేది. ఈ నెల రెండో వారంలో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.1,000 డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా మరో రూ.1000 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.

Redmi Note 14 SE 5G smartphone discount

రూ.12999 ధరకే లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్ :
అంటే మొత్తంగా రూ.2 వేల డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను రూ.12999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ 2025 సేల్‌లో ICICI, యాక్సె్స్‌ బ్యాంకు కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. బడ్జెట్‌ ధరలో లేటెస్ట్ 5G ఫోన్‌ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫోన్‌ మీకో మంచి ఆప్షన్‌ అయ్యే అవకాశం ఉంది.

రెడ్‌మి నోట్ 14 SE 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
రెడ్‌మి నోట్‌ 14 SE 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

Redmi Note 14 SE 5G smartphone discount

50MP కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా రెడ్‌మి ఫోన్‌ వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్‌ 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 6GB LPPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hyper OS పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

Redmi Note 14 SE 5G smartphone discount

ఈ హ్యాండ్‌సెట్‌ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5110mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లేను ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.3, Wi-Fi 802.11 ac, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. మరియు ఆడియో అవుట్‌పుట్‌ కోసం డాల్బీ అట్మాస్‌, Hi-Res సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ టైటాన్‌ బ్లాక్‌, క్రిమ్సన్‌ ఆర్ట్‌, మిస్టిక్‌ వైట్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Redmi Note 14 SE 5G smartphone now available at Rs12999 price on flipkart big billion days 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X