Home
Deal of the day

50MP సోనీ కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్ పై డిస్కౌంట్‌..!

Redmi Note 14 SE 5G Smartphone : రెడ్‌మి నుంచి ఇటీవల నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్‌ అమోలెడ్ డిస్‌ప్లే, 108MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌, 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. అయితే గత సంవత్సరం రెండో భాగంలో రెడ్‌మి నోట్‌ 14 SE 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ప్రస్తుతం ఈ ఫోన్ డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఈ ఫోన్‌ 50MP కెమెరా, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.

రెడ్‌మి నోట్‌ 14 SE 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉండేది. ప్రస్తుతం రూ.13499 ధరకు కొనుగోలు చేయవచ్చు.

Redmi Note 14 SE 5G Smartphone

రూ.1500 డిస్కౌంట్‌ :
అంటే రూ.1500 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ ఫోన్‌ టైటాన్‌ బ్లాక్‌, మిస్టిక్‌ వైట్‌, క్రిమ్సన్‌ ఆర్ట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే :
రెడ్‌మి నోట్‌ 14 SE 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను పొందుతోంది.

మీడియాటెక్‌ చిప్‌, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 6GB LPPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hyper OS పైన పనిచేస్తోంది. 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతోంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 2MP మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. దీంతోపాటు LED ఫ్లాష్‌ లైట్‌ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 20MP కెమెరాను కలిగి ఉంది.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ :
ఈ ఫోన్‌ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5110mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.3, Wi-Fi, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం Hi-Res ఆడియో, డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్పీకర్లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 14 SE 5G Smartphone with 50MP Sony Camera gets Rs1500 discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X