6 సంవత్సరాల అప్‌డేట్స్, 50MP OIS కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ 5G ఫోన్‌పై డిస్కౌంట్!
భారత్ మార్కెట్ లో శాంసంగ్ సంస్థ ఈ సంవత్సరం అనేక మోడల్స్ ను లాంచ్ చేసింది. ఇందులో A, M, F సిరీస్ వంటి మోడల్స్‌తోపాటు ఫ్లాగ్‌షిప్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో విడుదల అయిన శాంసంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను అందిస్తుంది. మరియు FHD + అమోలెడ్ డిస్‌ప్లే, 50MP కెమెరాను కలిగి ఉంది.
ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్ లను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20499, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23999 గా ఉంది.

దీంతోపాటు (Samsung Galaxy A17 5G Smartphone) ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, బ్లూ, గ్రే కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
శాంసంగ్ గెలాక్సీ A17 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
శాంసంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ ఇన్ఫినిటీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ను పొందుతోంది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ Exynos 1330 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 తో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని శాంసంగ్ తెలిపింది. సర్కిల్ టూ సెర్చ్, గూగుల్ జెమిని వంటి ఫీచర్లు ఉన్నాయి.
50MP OIS కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ గెలాక్సీ A17 5G హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 5MP అల్ట్రావైడ్, 2MP మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను కలిగి ఉంది.
ఫాస్ట్ ఛార్జింగ్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP54 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.3, WiFi 5, GPS, NFC, OTG, USB-C ఛార్జింగ్ పోర్టు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








