Home
Deal of the day

రూ.30 వేల ఫోన్‌.. రూ.17 వేలకే.. 50MP కెమెరా, ఫుల్ HD+ డిస్‌ప్లే, 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్..!

శాంసంగ్‌ భారత్‌ మార్కెట్‌ లో ఎంట్రీ, బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌, ఫ్లాగ్‌షిప్‌ సెగ్మెంట్‌ లో అనేక మోడల్స్‌ ను లాంచ్ చేసింది. ప్రస్తుతం పండుగ సేల్‌ లో భాగంగా అనేక మోడల్స్‌ భారీ డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉంది. గత సంవత్సరం విడుదల అయిన శాంసంగ్‌ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ ను ప్రస్తుతం భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP, 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

ఏకంగా రూ.14 వేల డిస్కౌంట్ :
విడుదల సమయంలో శాంసంగ్‌ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy A35 5G Smartphone) 8GB/128GB స్టోరేజీ ధర రూ.30999, 8GB/256GB ధర రూ.33999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో రూ.13000, రూ.14000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

samsung Galaxy A35 5G Smartphone pricedrop

మిడ్‌ రేంజ్‌ ఫోన్‌.. బడ్జెట్‌ ధరకే :
ఫలితంగా ఈ ఫోన్‌ ల ధరలు రూ.17999, రూ.19999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ ఫోన్‌ Awesome లిలక్‌, Awesome ఐస్‌ బ్లూ, Awesome నేవీ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

ఫుల్ HD+ డిస్‌ప్లే :
శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ 6.6 అంగుళాలు FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌ ను పొందుతుంది. IP67 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

samsung Galaxy A35 5G Smartphone pricedrop

5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ Exynos 1380 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. Mali G68 కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6.1 OS పైన పనిచేస్తోంది. ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 5MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాను కలిగి ఉంది.

5000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 25W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.4, Wi-Fi 6, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. Knox 3.1 ఫీచర్‌ ను కూడా పొందుతుంది. సెక్యూరిటీ కోసం ఫేస్‌ అన్‌లాక్‌, ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ను అమర్చి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung Galaxy A35 5G Smartphone gets Rs14000 discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X