ఇలా చేస్తే శాంసంగ్ ఫోన్‌పై రూ.6000 తగ్గింపు.. 6 సంవత్సరాల అప్‌డేట్స్, 6.7 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా..!
Samsung Galaxy A36 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ ఈ సంవత్సరం మార్చి నెలలో గెలాక్సీ A36 5G ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మిడ్ రేంజ్ ధరలో ఈ హ్యాండ్‌సెట్ ను లాంచ్ చేసింది. అయితే అమెజాన్‌లో ప్రస్తుతం భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఏకంగా 6 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను పొందవచ్చు.
ఈ ఫోన్ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.32,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.35,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.38,999 గా ఉంది. గత నెలలో శాంసంగ్ రూ.2000 చొప్పున తగ్గించింది.

భారీ తగ్గింపు!
ఫలితంగా ఈ ఫోన్‌ల ధరలు వరుసగా రూ.30,999, రూ.33,999, రూ.36,999 గా ఉన్నాయి. అయితే తాజాగా అమెజాన్‌లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను కేవలం రూ.24780 కే సొంతం చేసుకోవచ్చు. అంటే రూ.6 వేల కంటే ఎక్కువ డిస్కౌంట్‌ను పొందవచ్చు. అమెజాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ ఫోన్ కోసం సెర్చ్ చేయండి.
అక్కడ ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.30999 గా కనిపిస్తుంది. అనంతరం పేజీని కొంచెం కిందకు స్క్రోర్ చేయండి. అక్కడ మీకు Style Name కనిపిస్తుంది. ఆ తర్వాత Other Offers కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే.. ధర రూ.24799 గా చూపిస్తుంది. అనంతరం Buy Now ఆప్షన్ పైన క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు.

డిస్‌ప్లే వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ A36 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 7+ ప్రొటెక్షన్‌నుపొందుతుంది. Awesome లావెండర్, Awesome బ్లాక్, Awesome వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుందని శాంసంగ్ తెలిపింది. ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.
ఈ ఫోన్ కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా (OIS), 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. 12MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ మోడల్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ A36 5G స్మార్ట్‌ఫోన్ IP67 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








