ధర రూ.9199 కే 50MP కెమెరా, ఆండ్రాయిడ్ 15 OS, 5000mAh బ్యాటరీ శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ శాంసంగ్ భారత్ మార్కెట్‌లో అనేక మోడల్స్‌ను లాంచ్ చేసింది. గత నెలలో గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర సుమారుగా రూ.10,000 గా ఉండేది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 తోపాటు 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. మరియు బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.
విడుదల సమయంలో :
శాంసంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy F06 5G Smartphone Price drop) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ లో అందుబాటులోకి వచ్చింది. విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.10,999, రూ.11,499 గా ఉంది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుత ధర :
ఫ్లి్ప్‌కార్ట్‌లో 4GB ర్యామ్ వేరియంట్‌ను రూ.9,199 కే కొనుగోలు చేయవచ్చు. అదే 6GB ర్యామ్ వేరియంట్‌ను రూ.10,699 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ Bahama బ్లూ, లిట్ వైలెట్ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది.
డిస్‌ప్లే వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ఎంట్రీ లెవల్‌లో కొత్త 5G ఫోన్ కోసం ఎదురుచూసే వారికి మంచి ఆప్షన్‌గా ఉంటుంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కోసం 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని శాంసంగ్ తెలిపింది.
బ్యాటరీ, కెమెరా వివరాలు :
ఈ ఫోన్‌ను నాలుగైదు సంవత్సరాల వరకు సౌకర్యంగా ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరాల పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుక వైపు LED ఫ్లాష్ లైట్‌ను కూడా అమర్చారు.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, వైఫై 802.11, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను అమర్చారు. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. శాంసంగ్ Knox Vault, వాయిస్ ఫోకస్, క్విక్ షేర్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








