Home
Deal of the day

రూ.3500 డిస్కౌంట్‌.. 6 సంవత్సరాల అప్‌డేట్స్‌, 50MP కెమెరా, AI ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్‌..!

శాంసంగ్‌ భారత్‌ మార్కె్ట్‌లో ఈ సంవత్సరం బడ్జెట్ సెగ్మెంట్‌లో F, M సిరీస్‌ ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం జులై నెలలో శాంసంగ్ గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy F36 5G Smartphone) లాంచ్‌ చేసింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్ 2025 సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను అందిస్తుంది.

రూ.3500 డిస్కౌంట్‌ :
భారత్‌లో విడుదల సమయంలో శాంసంగ్ గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17,499, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.18,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో గరిష్ఠంగా రూ.3500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Samsung Galaxy F36 5G smartphone telugu news

10 శాతం అదనపు డిస్కౌంట్ :
ప్రస్తుతం 6GB/128GB ధర రూ.13999 గా ఉంది. 8GB/128 ధర రూ.15499, 8GB/256GB రూ.17499 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌ కోరల్‌ రెడ్‌, ఒనిక్స్ బ్లాక్‌, Luxe వైలెట్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌+ ప్రొటెక్షన్‌ను పొందుతోంది. ఈ ఫోన్ క్లాసీ లెదర్ ప్యాట్రన్‌ డిజైన్‌తో అందుబాటులో ఉంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ Exynos 1380 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు Mali G68 MP5 GPU ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7 తో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 6 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

సూపర్ ఫీచర్లు :
ఈ ధరలో 6 సంవత్సరాల అప్‌డేట్స్‌ మంచి అవకాశంగా భావించవచ్చు. దీంతోపాటు అనేక AI ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. ఈ జాబితాలో సర్కిల్‌ టూ సెర్చ్, జెమిని లైవ్, ఇమేజ్‌ క్లిప్పర్‌, Object Eraser, AI Edit Suggestion వంటివి ఉన్నాయి.

Samsung Galaxy F36 5G smartphone telugu news

కెమెరా విభాగం పరంగా వెనుక ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ లెన్స్‌, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాను అమర్చి ఉంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి.

ఈ హ్యాండ్‌సెట్ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ట్యాప్‌ అండ్‌ పే ఆప్షన్‌తో శాంసంగ్‌ వాలెట్‌, Knox Vault, వాయిస్ ఫోకస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

FAQs
శాంసంగ్‌ గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్‌ ఎంత డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది?

విడుదల ధరతో పోలిస్తే బ్యాంకు ఆఫర్లతో సంబంధం లేకుండా నేరుగా రూ.3500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ F36 5G ప్రత్యేకత ఏంటీ?

ఈ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల వరకు OS, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. మరియు అనేక AI ఫీచర్లు కూడా ఉన్నాయి.

శాంసంగ్‌ గెలాక్సీ F36 5G ఎలాంటి డిస్‌ప్లేను కలిగి ఉంది?

ఈ ఫోన్ 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.

GizBot Technology
Best Mobiles in India

English summary
Samsung Galaxy F36 5G smartphone gets Rs3500 price discount on Flipkart big billion fdays 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X