రూ.6799 ధరకే శాంసంగ్ ఫోన్.. 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ..!
Samsung Galaxy M07 4G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ శాంసంగ్ గత నెలలో భారత్ మార్కెట్ లో శాంసంగ్ గెలాక్సీ M07 4G స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. రూ.7 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ తక్కువ ధరలోనే తీసుకొచ్చిన ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను అందిస్తుందని శాంసంగ్ హామీ ఇచ్చింది. ఈ ఫోన్ 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్ లు, ఫీచర్‌ల వివరాలు.
రూ.6799 ధరకే ఫోన్ :
శాంసంగ్ గెలాక్సీ M07 4G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7699 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్ లో రూ.6799 ధరకే అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్ కలర్ వేరియంట్ లో మాత్రమే ప్రస్తుతం లభిస్తోంది.

ఆకట్టుకొనే డిజైన్ :
శాంసంగ్ హ్యాండ్‌సెట్ 7.6mm థిక్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ గ్లాస్ ఫైబర్ రెయిన్‌ఫోర్డ్స్ పాలిమర్ బ్యాక్ ప్యానల్ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల LCD HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది.
ఆండ్రాయిడ్ 15 OS :
గెలాక్సీ M07 4G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ చిప్ 4GB ర్యామ్, 64GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తోంది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉందని శాంసంగ్ తెలిపింది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 6 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని శాంసంగ్ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
50MP ఆటోఫోకస్ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 5OMP ప్రైమరీ, 2MP డెప్త్ సెన్సర్ ను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా ఆటోఫోకస్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్ కోసం 8MP కెమెరాను అమర్చారు.
ప్రత్యేక ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ M07 4G స్మార్ట్‌ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. కనెక్టివిటీ పరంగా 4G, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB-C ఛార్జింగ్ పోర్టు ఉన్నాయి. దీంతోపాటు Knox Vault సెక్యూరిటీ సిస్టమ్, థెఫ్ట్ ప్రొటెక్షన్, ఆటో బ్లాకర్ ఫీచర్లను కూడా కలిగి ఉంది. వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications







