ధర రూ.10,999 కే, 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ తో Samsung 5G ఫోన్ ! సేల్ వివరాలు
ప్రస్తుతం అమెజాన్ లో కొనసాగుతున్న దీపావళి సేల్ లో Samsung Galaxy M15 5G ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ పై ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, సూపర్ AMOLED డిస్‌ప్లేతో సహా వివిధ డిస్‌ప్లే ఫీచర్‌లతో వస్తుంది. ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ M15 5G ప్రైమ్ ఎడిషన్ మోడల్ ఇక్కడ అందించే ఆఫర్‌లు మరియు ఫీచర్లను చూడండి.
శాంసంగ్ గెలాక్సీ M15 5G ప్రైమ్ ఎడిషన్ 4GB RAM మోడల్ ప్రస్తుతం అమెజాన్ సేల్ లో MRP రూ.15,999 నుండి 31 శాతం తగ్గింపుతో రూ.10,999 కి సేల్ చేయబడుతోంది. అదే విధంగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,499 గా సేల్ అవుతోంది.
ఈ ఫోన్ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Samsung Galaxy M15 5G ప్రైమ్ ఎడిషన్ స్పెసిఫికేషన్ల వివరాలు
శాంసంగ్ గెలాక్సీ M15 5G ప్రైమ్ ఎడిషన్ హ్యాండ్‌సెట్ 6.5 అంగుళాల FHD+ (1080*2340 పిక్సల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, 19.5:9 యాస్పెక్ట్ రేషియోతో విడుదల అయింది.
ఈ ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.0 OS ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు OS అప్‌డేట్‌లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందనుందని శాంసంగ్ తెలిపింది.
కెమెరా వివరాలు గమనిస్తే ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 5MP, 2MP కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 13MP కెమెరాను అమర్చారు. 25W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
దీంతోపాటు ఈ శాంసంగ్ గెలాక్సీ M15 5G ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ Knox సెక్యూరిటీతో పాటు క్విక్ షేర్ ఫీచర్‌లు, కాల్ నాణ్యత కోసం వాయిస్ ఫోకస్ ఫీచర్‌లతో విడుదల అయింది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, GPS, బ్లూటూత్ 5.3, వైఫై, USB-C, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ బ్లూ టోపాజ్, సెలెస్టియల్ బ్లూ మరియు స్టోన్ గ్రే రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications







