Home
Deal of the day

రూ.12,499 ధరకు ఫాస్ట్ ఛార్జింగ్‌, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌, సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌!

భారత్‌ మార్కెట్‌లో శాంసంగ్‌ ఇటీవల అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఎంట్రీ లెవల్‌ నుంచి ఫ్లాగ్‌షిప్‌ సెగ్మెంట్‌లో వివిధ మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంవత్సరం చివర్లో శాంసంగ్‌ ట్రై ఫోల్డ్‌ ఫోన్‌ ను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే తొలి దశలో భారత్‌ లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇటీవల విడుదల అయిన శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ బడ్జెట్‌ రేంజ్‌ లో అందుబాటులోకి వచ్చినా.. ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను అందిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy M17 5G Smartphone) ప్రస్తుతం శాంసంగ్‌ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అమెజాన్‌లో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12,499, 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.15,499 గా ఉంది.

samsung galaxy M17 5G smartphone amazon offer

స్లిమ్ ప్రొఫైల్, రెండు కలర్ వేరియంట్స్ :
ఈ గెలాక్సీ M17 5G హ్యాండ్‌సెట్ 7.5mm థిక్‌నెస్‌ తో కూడిన స్లిమ్‌ ప్రొఫైల్‌ ను కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మూన్‌లైట్‌ సిల్వర్‌, Sapphire బ్లాక్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.

సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే, ఇతర ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ శాంసంగ్ Knox Vault, వాయిస్‌ మెయిల్, వాయిస్ ఫోకస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు ట్యాప్‌ అండ్‌ పే ఫీచర్‌తో శాంసంగ్ వాలెట్‌ను కలిగి ఉంది.

samsung galaxy M17 5G smartphone amazon offer

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌ హ్యాండ్‌సెట్‌ Exynos 1330 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OneUI 7 పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏకంగా 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌ తోపాటు 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని శాంసంగ్ హామీ ఇచ్చింది.

50MP OIS కెమెరా :
ఈ హ్యాండ్‌సెట్‌ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 5MP అల్ట్రావైడ్‌, 2MP మ్యాక్రో కెమెరాలున్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఫాస్ట్ ఛార్జింగ్ :
శాంసంగ్‌ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌ 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. సర్కిల్‌ టు సెర్చ్ వంటి ఫీచల్లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌, వైఫై, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung galaxy M17 5G smartphone with super Amoled display, 6 years of updates available at Rs12499
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X