అమెజాన్ సేల్.. ఏకంగా రూ.5000 తగ్గింపుతో 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్..!
భారత్‌లో ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy M35 5G Smartphone) భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో విడుదల ధరతో పోలిస్తే ప్రస్తుతం రూ.5000 డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అయితే అమెజాన్ (Amazon) డిస్కౌంట్‌తోపాటు బ్యాంకు ఆఫర్లను కూడా పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
శాంసంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. అమెజాన్‌లో రూ.5000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫలితంగా విడుదల సమయంలో 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.19,999 గా ఉండే.. ప్రస్తుతం రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు.

అదే 128GB స్టోరేజీ వేరియంట్ విడుదల సమయంలో రూ.21499 గా ఉండేది. ప్రస్తుతం రూ.16499 కే కొనుగోలు చేయవచ్చు. మరియు 256GB స్టోరేజీ వేరియంట్ విడుదల సమయంలో రూ.24,499 గా ఉంటే.. ప్రస్తుతం రూ.19,499 కే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
శాంసంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్ స్సెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల FHD+ (1080*2340 పిక్సల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంది.

ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ Exynos 1380 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు గ్రాఫిక్స్ అవసరాల కోసం Mali G68 MP5 GPU చిప్‌సెట్‌ను కూడా అమర్చి ఉంది. ఈ గెలాక్సీ M35 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6 OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ మూడు వేరియంట్‌లో అందుబాటులో ఉంది. మరియు మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP, 2MP కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 13MP కెమెరాలను అమర్చి ఉంది. మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G (SA/NSA), డ్యూయల్ 4G VoLTE, బ్లూటూత్ 5.3, వైఫై 6, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉన్నాయి. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. డే బ్రేక్ బ్లూ, మూన్ లైట్ బ్లూ, థండర్ గ్రే రంగుల్లో ప్రస్తుతం లభిస్తోంది.


Click it and Unblock the Notifications







