Home
Deal of the day

ధర రూ.19999 5G ఫోన్‌ను రూ.14999 కే కొనుగోలు చేయవచ్చు.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా సహా..!

శాంసంగ్‌ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy M35 5G Smartphone) గత సంవత్సరం జులైలో భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ మిడ్‌రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ఫుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు మీకోసం.

రూ.5000 డిస్కౌంట్‌ :
శాంసంగ్‌ గెలాక్సీ M35 5G హ్యాండ్‌సెట్‌ విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.14999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21499 కి విడుదల కాగా.. ప్రస్తుతం రూ.16499 కే సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy M35 5G Smartphone price in india

కలర్‌ వేరియంట్స్‌ :
అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.24499 కి విడుదల కాగా ప్రస్తుతం రూ.19499 కి కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ మూన్‌లైట్‌ బ్లూ, డే బ్రేక్‌ బ్లూ, థండర్‌ గ్రే కలర్‌ వేరియంట్స్‌లో ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

ప్రాసెసర్‌, OS :
గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ Exynos 1380 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్‌ టాస్క్‌ల కోసం కోసం Mali G68 MP5 GPU ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6 OS ను కలిగి ఉంది. వేపర్‌ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది.

Samsung Galaxy M35 5G Smartphone price in india

భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌తోపాటు 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని శాంసంగ్‌ వెల్లడించింది. ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

Take a Poll

ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల FHD+ (1080*2340 పిక్సల్స్‌) సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్లస్‌ రక్షణను పొందుతుంది.

ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌, OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. f/2.2 అపేచర్‌తో అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, f/2.4 అపేచర్‌తో మ్యాక్రో యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంది. f/2.2 అపేచర్‌తో 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలతో 30fps వద్ద అల్ట్రా HD రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డు చేయవచ్చు.

ఈ హ్యాండ్‌సెట్‌ Knox సెక్యూరిటీ, డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం 5G, 4G VoLTE, WiFi 6, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy M35 5G Smartphone gets massive price drop in amazon 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X