రూ.14999 ధరకు 6 సంవత్సరాల అప్‌డేట్స్, 50MP OIS కెమెరా, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5G ఫోన్!
శాంసంగ్ సంస్థ భారత్ మార్కెట్ లో బడ్జెట్ రేంజ్ ఈ సంవత్సరం అనేక మోడల్స్ ను లాంచ్ చేసింది. F, M సిరీస్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చింది. అయితే శాంసంగ్ కొన్ని ఫోన్‌లపై ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను అందిస్తోంది. ఈ సంవత్సరం జూన్‌లో అందుబాటులోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మా్ర్ట్‌ఫోన్ కూడా 6 ఏళ్ల అప్‌డేట్స్‌ను పొందుతుంది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.15 వేల ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
రూ.14999 ప్రారంభ ధరకు :
శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy M36 5G Smartphone) ప్రస్తుతం 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 (సెరీన్ గ్రీన్) గా ఉంది. మిగిలిన రెండు కలర్ వేరియంట్స్ వెల్‌వెట్ బ్లాక్, ఆరెంజ్ హాజ్‌ల ధర రూ.17499 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16499 గా ఉంది.

రూ.500 కూపన్ కోడ్ డిస్కౌంట్ :
అయితే గ్రీన్ కలర్ వేరియంట్ ధర మాత్రం రూ.18999 గా ఉంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.21999 గా ఉంది. అయితే 256GB స్టోరేజీ వేరియంట్ పై రూ.500 కూపన్ కోడ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫలితంగా రూ.21499 కే కొనుగోలు చేయవచ్చు.
సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే :
శాంసంగ్ గెలాక్సీ M36 5G ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే విజన్ బూస్టర్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ పొందుతోంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్ Exynos 1380 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తోంది. అయితే ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని శాంసంగ్ హామీ ఇచ్చింది.
ట్రిపుల్ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉండేది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 12MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి. ఈ హ్యాండ్‌సెట్ Edit Suggestions, Object Eraser, image Clipper వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు ఉన్నాయి. దీంతోపాటు సర్కిల్ టూ సెర్చ్ ఫీచర్ కూడా ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.


Click it and Unblock the Notifications








