రూ.4 వేల డిస్కౌంట్.. 6 సంవత్సరాల అప్‌డేట్స్, 50MP కెమెరా, ఫుల్ HD+ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!
భారత్ మార్కెట్ లో శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం తొలి భాగంలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఆకట్టుకొనే డిజైన్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ లో మెరుగైన కెమెరా, బ్యాటరీతోపాటు అనేక బెస్ట్ ఫీచర్ లు ఉన్నాయి. మరియు ఈ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను పొందుతుంది. అయితే ప్రస్తుతం అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్ లు, ఫీచర్ లు, ఆఫర్ పూర్తి వివరాలు.
రూ.4 వేల డిస్కౌంట్ ఆఫర్ :
శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ ( Samsung Galaxy M36 5G Smartphone ) ఈ సంవత్సరం జూన్ లో విడుదల అయింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఈ ఫోన్ రూ.4 వేల డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ లో భాగంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

రూ.13999 ధరకే 5G స్మార్ట్‌ఫోన్ :
గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21999 గా ఉండేది. ప్రస్తుతం ఈ ఫోన్‌లను రూ.13999, రూ.15499, రూ.17499 ధరలకే కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ Exynos 1380 చిప్‌సెట్ ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని శాంసంగ్ తెలిపింది.

ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే విజన్ బూస్టర్ ఫీచర్‌తోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
50MP OIS కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ( OIS ) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 12MP అల్ట్రా వైడ్ లెన్స్, 5MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 4K వీడియోను రికార్డు చేస్తుంది. సర్కిల్ టూ సెర్చ్, Object Eraser, image Clipper, Edit Suggestions వంటి AI ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








