6 ఏళ్ల అప్‌డేట్స్ పొందే శాంసంగ్ 5G ఫోన్‌పై రూ.5 వేల డిస్కౌంట్.. 50MP కెమెరా, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే సహా!
Samsung Galaxy M56 5G Smartphone : శాంసంగ్ ఈ సంవత్సరం M సిరీస్ ను అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఎంట్రీ, బడ్జెట్, మిడ్‌రేంజ్‌లో వివిధ మోడల్స్ ను తీసుకొచ్చింది. అయితే ఈ సంవత్సరం తొలిభాగంలో శాంసంగ్ నుంచి గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ ను సుమారు రూ.5 వేల డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ సూపర్ అమోలెడ్+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
ఈ వేరియంట్‌పై డిస్కౌంట్ :
శాంసంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.27,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.30,999 గా ఉండేది. ప్రస్తుతం 8GB/128GB స్టోరేజీ వేరియంట్‌ను అమెజాన్‌తో తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.

మొత్తంగా రూ.5 వేల డిస్కౌంట్ :
అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.24999 గా ఉంది. అంటే విడుదల ధరతో పోలిస్తే రూ.3 వేల తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. దీంతోపాటు HDFC బ్యాంకు క్రెడిట్ కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మొత్తంగా రూ.5 వేల డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను రూ.22999 ధరకు కొనుగోలు చేయవచ్చు.
సూపర్ అమోలెడ్+ డిస్‌ప్లే :
గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ 6.73 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ప్రొటెక్షన్‌ను పొందుతుంది. బ్లాక్, లైట్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
6 సంవత్సరాల అప్‌డేట్స్ :
ఈ ఫోన్ ఆక్టా కోర్ Exynos 1480 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తోంది. 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. 12MP సెల్ఫీ కెమెరా ఉంది. Object Eraser, image Clipper, Edit Suggestions ఫీచర్లు ఉన్నాయి.
గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ 45W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ వేపర్ కూలింగ్ ఛాంబర్ ను కలిగి ఉంటుంది. ఫోన్ విజన్ బూస్టర్ ఫీచర్ ఉంది. మెటల్ క్యామ్ డెకో గ్లాస్ ప్యానల్‌తో అందుబాటులో ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, Wi-Fi, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








