Home
Deal of the day

512GB స్టోరేజీ ఫోన్‌పై ఏకంగా రూ.12000 తగ్గింపు.. 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ సహా సూపర్‌ ఫీచర్లు..!

శాంసంగ్‌ నుంచి గత నెలలో గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. గత నెలలోనే సేల్‌ కూడా ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. మరియు డైనమిక్ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఆర్మర్‌ అల్యూమినియం ఫ్రేమ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. అది కూడా ఎటువంటి బ్యాంకు కార్డుల అవసరం లేకుండానే..!

శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.59,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.65,999, 8GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.77999 గా ఉండేది. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో 8GB/512GB వేరియంట్ ను భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy S25 FE Smartphone telugu news

ప్రస్తుతం అమెజాన్‌లో 8GB/512GB వేరియంట్‌ను రూ.65,999 కే అందుబాటులో ఉంది. అంటే సుమారుగా రూ.12 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌ నేవీ, జెట్ బ్లాక్, వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ S25 FE స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy S25 FE Smartphone) 6.7 అంగుళాల FHD+ డైనమిక్ అమోలెడ్‌ 2x డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1900 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా విక్టస్‌+ ప్రొటెక్షన్‌ ను పొందుతుంది.

Samsung Galaxy S25 FE Smartphone telugu news

IP68 రేటింగ్ :
ఈ డిస్‌ప్లే విజన్‌ బూస్టర్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆర్మర్‌ అల్యూమినియం ఫ్రేమ్ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఫలితంగా 1.5 మీటర్ల స్వచ్చమైన నీటిలో 30 నిమిషాలపాటు ఉంచినా డ్యామేజీ కాదని శాంసంగ్ చెబుతోంది.

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
శాంసంగ్‌ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ 4nm Exynos 2400 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 8 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 7 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని శాంసంగ్‌ హామీ ఇచ్చింది.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను అమర్చి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 12MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, మరియు 3x ఆప్టికల్‌ జూమ్‌తో 8MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 12MP కెమెరాతో అందుబాటులో ఉంది.

Samsung Galaxy S25 FE Smartphone telugu news

ఈ హ్యాండ్‌సెట్ సర్కిల్‌ టూ సెర్చ్‌, జెమిని లైవ్‌ సహా అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 45W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 4900mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ Knox Vault, బ్లూటూత్‌, వైఫై, USB- ఛార్జింగ్‌ పోర్టు సహా అనేక కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S25 FE Smartphone 512GB Variant gets Rs12000 pricecut on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X