Home
Deal of the day

ఈ ఫోన్‌పై రూ.6 వేల డిస్కౌంట్‌.. పవర్‌ఫుల్‌ చిప్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సహా ఆకట్టుకొనే ఫీచర్లు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్‌ నుంచి ఇటీవల గెలాక్సీ S26 సిరీస్‌ విడుదల అయింది. ఇందులో గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్‌, గెలాక్సీ S26 అల్ట్రా మోడల్స్‌ లాంచ్‌ అయ్యాయి. ప్రస్తుతం ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉండగా.. వచ్చే వారం నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. దీంతోపాటు త్వరలో గెలాక్సీ A37, గెలాక్సీ A57 మోడల్స్‌ కూడా లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలే బెంచ్‌ మార్క్‌ వెబ్‌సైట్‌లలో కనిపించాయి.

ఫోన్‌ ధర తగ్గింపు :
అయితే గత సంవత్సరం విడుదల అయిన శాంసంగ్‌ గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy S25 Smartphone Price drop) భారీ తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. అది కూడా ఎటువంటి బ్యాంకు కార్డుల అవసరం లేకుండానే. ప్రస్తుతం ఈ ఫోన్ శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

samsung galaxy S25 smartphone pricecut

విడుదల సమయంలో గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.80999 గా ఉండేది. ప్రస్తుతం రూ.74999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.92999 గా ఉండేది. ప్రస్తుతం రూ.86999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

అంటే రూ.6 వేల తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ నేవీ, ఐసీ బ్లూ, మింట్‌, సిల్వర్‌ షాడో కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

డైనమిక్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ :
శాంసంగ్‌ గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6,2 అంగుళాల FHD+ డైనమిక్‌ అమోలెడ్‌ 2x డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 25W వైర్‌ ఛార్జింగ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 4000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌, 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 8 Elite ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 తో పనిచేస్తోంది. ఈ ఫోన్ 7 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని శాంసంగ్‌ హామీ ఇచ్చింది.

50MP OIS :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 12MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్‌ ఉంది. ముందువైపు 12MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది.

ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో సర్కిల్‌ టు సెర్చ్, కాల్‌ ట్రాన్స్‌క్రిప్ట్‌, రైటింగ్‌ అసిస్టెంట్‌, డ్రాయింగ్‌ అసిస్టెంట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung galaxy S25 smartphone with snapdragon 8 Elite chip gets pricedrop in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X