200MP కెమెరా కలిగిన శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌పై రూ.20 వేల డిస్కౌంట్..!
Samsung Galaxy S25 Ultra Smartphone : భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ఇటీవల విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా మోడల్స్ సేల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. అల్ట్రా సిరీస్ ప్రైవసీ డిస్‌ప్లే, 200MP కెమెరా సహా ఆకట్టుకొనే ఫీచర్లను కలిగి ఉంది. ఈ సిరీస్ విడుదలతో గత వేరియంట్స్ ధరలు తగ్గుతున్నాయి. ఇప్పటికే గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 FE మోడల్స్ డిస్కౌంట్ ధరలకు అందుబాటులో ఉన్నాయి.
తాజాగా శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మోడల్ కూడా భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.1,29,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.1,41,999, 12GB ర్యామ్ + 1TB స్టోరేజీ ధర రూ.165999 గా ఉండేది.

రూ.20 వేలకు పైగా డిస్కౌంట్ :
ప్రస్తుతం 12GB/256GB స్టోరేజీ వేరియంట్‌ను సుమారుగా రూ.20 వేలకు పైగా డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ధర రూ.1,07,397 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
డిస్‌ప్లే వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.9 అంగుళాల డైనమిక్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ ఆర్మర్ 2 ప్రొటెక్షన్‌ను పొందుతోంది. టైటానియం వైట్ సిల్వర్, టైటానియం బ్లాక్, టైటానియం గ్రే, టైటానియం సిల్వర్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

7 సంవత్సరాల అప్‌డేట్స్, S పెన్ సపోర్టు :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OneUI 7 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ అనేక ఏఐ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ 7 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. S పెన్‌ను సపోర్టు చేస్తుంది.
200MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు నాలుగు కెమెరాలున్నాయి. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), 2X జూమ్‌తో 200MP ప్రైమరీ కెమెరా, 120 డిగ్రీల ఫీల్డ్‌వ్యూతో 50MP అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్, OISతో 50MP టెలిఫోటో లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, OIS సపోర్టుతో 10MP టెలిఫోటో కెమెరాలున్నాయి. 12MP సెల్ఫీ కెమెరా ఉంది.
గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 45W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై 7, NFC, GPS, USBC ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








