Home
Deal of the day

ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్.. రూ.80 వేల ఫోన్ కేవలం రూ.7 వేలకే.. ఎలాగో తెలుసుకోండి!

iPhone 16: ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ యాపిల్ లేటెస్ట్ మొబైల్ అయిన ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 128GB మోడల్ అసలు ధర రూ.79,900 కాగా, ఫిప్‌కార్ట్ ఏకంగా 12 శాతం డిస్కౌంట్‌తో రూ.68,999కే అమ్ముతోంది. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్ కింద మరో రూ.2,000 తగ్గింపుతో ధర మరింత దిగొచ్చి రూ.66,999కి చేరుకుంటుంది. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఐతే ఇప్పుడు ఏకంగా రూ.7000లోపే ఐఫోన్ 16ని సొంతం చేసుకోవచ్చు.

మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే అక్షరాలా రూ.60,200 వరకు తగ్గింపు పొందొచ్చు. మీకు గనుక ఫుల్ ఎక్స్ఛేంజ్ వాల్యూ వస్తే, ఐఫోన్ 16ని మీరు జస్ట్ రూ.6,799కే సొంతం చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ మొత్తం మీ పాత ఫోన్ మోడల్, దాని కండిషన్ ఆధారంగా మారుతుంది.

Special Deal on Flipkart  Get iPhone 16 for Just Rs 7000 Here How to grab

* ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్

ఈ డీల్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగం. ఈ సేల్ మార్చి 7 నుంచి మార్చి 13, 2025 వరకు మాత్రమే ఉంటుంది. HDFC బ్యాంక్ కార్డ్‌లు ఉపయోగించే కస్టమర్లు ఎంపిక చేసిన మోడళ్లపై అదనంగా రూ.4,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా నో-కాస్ట్ EMI ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కూపన్ డిస్కౌంట్లు ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16e మోడల్స్‌పై కూడా భారీ ధర తగ్గింపులు ఉన్నాయి. ఐఫోన్ 16 ప్లస్ అసలు ధర రూ.89,900 ఉండగా, ఇప్పుడు రూ.78,999కి అందుబాటులో ఉంది. HDFC ఆఫర్‌తో కలిపి దీన్ని రూ.74,999కే కొనొచ్చు. అలాగే ఐఫోన్ 16e ఇప్పుడు రూ.59,900 నుంచి తగ్గి రూ.55,900కి లభిస్తుంది.

* ఐఫోన్ 16 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఐఫోన్ 16 చాలా శక్తివంతమైన A18 బయోనిక్ చిప్‌తో వస్తోంది, ఇది ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇందులో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. కొత్త కెమెరా కంట్రోల్ బటన్ వాడటానికి సులభంగా ఉంటుంది. వెనుకవైపు 48MP ప్రైమరీ లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా సెటప్ ఉంది, ముందు కెమెరా 12MP.

ఈ ఫోన్ iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. ఐఫోన్ 16లో 5G కనెక్టివిటీతో పాటు 4G, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

ఇది డ్యూయల్ సిమ్ (నానో-సిమ్ + eSIM) సపోర్ట్ చేస్తుంది. బ్లాక్, వైట్, పింక్, టీల్, అల్ట్రామెరైన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ చాలా స్లిమ్‌గా, తేలికగా, కేవలం 170 గ్రాములు మాత్రమే బరువు ఉంటుంది. ఇంకా యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి ముఖ్యమైన సెన్సార్లు కూడా ఉన్నాయి.

యాపిల్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.6,799కే సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ మార్చి 13 వరకు మాత్రమే చెల్లుతుందని గుర్తుపెట్టుకోండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big Saving Days offer the iPhone 16 for just Rs. 7K with huge discounts, exchange deals, and bank offers, making Apple's latest smartphone highly affordable for a limited time.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X