6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz రీఫ్రెష్ రేట్ 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.2500 డిస్కౌంట్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ టెక్నో ఈ సంవత్సరం జులై నెలలో టెక్నో పోవా 7 5G సిరీస్‌ను లాంచ్ చేసింది. R ఈ సిరీస్‌లో భాగంగా టెక్నో పోవా 7 5G, పోవా 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్లు భారీ డిస్‌ప్లేతోపాటు 6000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. మరియు 50MP కెమెరాను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో టెక్నో పోవా 7 5G స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
భారత్ మార్కెట్‌లో విడుదల సమయంలో టెక్నో పోవా 7 5G స్మార్ట్‌ఫోన్ (Tecno Pova 7 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.15999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి 2025 (Flipkart Big Bang Diwali 2025) సేల్‌లో భాగంగా డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

రూ.2500 డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో భాగంగా ఈ ఫోన్ 8GB/128GB వేరియంట్ ధర రూ.12499 గా ఉంది. అంటే రూ.2500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ గీన్ బ్లాక్, మేజిక్ సిల్వర్, ఒయాసిస్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
టెక్నో పోవా 7 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
టెక్నో పోవా 7 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల FHD+ ఫ్లాట్ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
మీడియాటెక్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 OS :
టెక్నో పోవా 7 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు Mali G615 MC2 GPU ను కూడా అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ ఒక సంవత్సరం ఆండ్రాయిడ్ OS అప్‌డేట్, రెండు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ Ella AI కూడా ఉంటుంది. AI కాల్ అసిస్టెంట్, AI ఆటో ఆన్సర్ ఫీచర్లున్నాయి. 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫీచర్‌ను అనేక భారతీయ భాషలను సపోర్టు చేస్తుంది. నెట్‌వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోను మెరుగైన సిగ్నల్ అందే విధంగా ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








