ధర రూ.20 వేల లోపు మార్కెట్లో ఉన్న టాప్-5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు! లిస్ట్ ఇదే.

By Maheswara

మీకు స్మార్ట్ ఫోన్ల గురించి సరియైన అవగాహన లేకున్నా, కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవడం ద్వారా, మీకు అవసరమైన ఉత్తమ స్మార్ట్‌ఫోన్ పరికరాన్ని మీరు కొనుగోలు చేయవచ్చు. కానీ మీకు తగిన 'సరైన' స్మార్ట్ ఫోన్ ను ఎంచుకోవడం ఇక్కడ చాలా మందికి సమస్య గా ఉంది. దీనికి ప్రధాన కారణం భారతీయ మార్కెట్‌లో లెక్కలేనన్ని స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు వివిధ ధరల విభాగాలలో అందుబాటులో ఉండడమే. దీని నుండి మీ కోసం సరైన పరికరాన్ని ఎంచుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

 
Top 5 Best 5G All Rounder Smartphones Under Rs.20000. List Includes Redmi,Realme,OnePlus And More Phones.

అటువంటి సమస్యను ఎదుర్కొంటున్న వారిలో మీరూ ఒకరైతే ఈ పోస్ట్ మీకోసమే. ప్రత్యేకించి మీరు బడ్జెట్ ధరలో అత్యుత్తమ ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, మీకోసం టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌లను ఇక్కడ ఇస్తున్నాము. పరిశీలించండి. మేము మీ కోసం ఉత్తమ ఫోన్‌లను ఎంచుకున్నాము. ఇవన్నీ 5జీతో నడిచే బడ్జెట్ ఫోన్ల కేటగిరి లో వస్తాయి.

 

iQOO Z6 5G

ఈ iQOO Z6 5G స్మార్ట్‌ఫోన్ మీకు బడ్జెట్ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 19,990 ఉంది. కానీ ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా, ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ. 14,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది మీకు 25% తగ్గింపును ఇస్తుంది. మీరు ఈ ఆఫర్‌ని సరిగ్గా ఉపయోగించుకుంటే, మీకు రూ. 4,991 అదా అవుతుంది.

Redmi Note 11T 5G

మీరు Redmi ని ఇష్టపడే వినియోగదారులు అయితే మరియు మీ స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని 5G సేవకు మార్చాలనుకునే వారు అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ మీకు బెస్ట్ ఫొనేఅవుతుంది. దీని అసలు ధర రూ. 20,999 ఉంది. ఇప్పుడు ఇది కేవలం రూ. 17,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ లో మీకు 14% తగ్గింపును ఇస్తుంది. మీరు ఈ ఆఫర్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటే, రూ. 3,000 మీరు ఆదా చేయవచ్చు.

Infinix Zero 5G

భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయ బ్రాండ్ నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌లలో ఇది ఒకటి. Infinix Zero 5G స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 24,999 ఉంది. ఇప్పుడు ఇది కేవలం రూ. 17,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది మీకు 28% తగ్గింపును అందిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా రూ. 7,000 మీరు తగ్గింపుగా పొందవచ్చు.

OnePlus Nord CE 2 Lite 5G

మీరు ఒక ప్రసిద్ధ బ్రాండ్ నుండి ఉత్తమ ఆల్-రౌండర్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఖచ్చితంగా OnePlus Nord CE 2 Lite 5G మోడల్‌ని ఎంచుకోవచ్చు. దీని అసలు ధర రూ. 19,999 గా ఉంది. ఇప్పుడు ఇది కేవలం రూ. 18,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది మీకు 5% తగ్గింపును ఇస్తుంది. ఈ ఆఫర్ ద్వారా రూ. 1,000 ఆదా చేయవచ్చు.

Realme Narzo 50 Pro 5G

అత్యుత్తమ ఆల్ రౌండర్ జాబితాలో మన చివరి మోడల్ రియల్‌మీ నార్జో 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మోడల్. దీని అసలు ధర రూ. 25,999 ఉంది. ఇప్పుడు ఇది కేవలం రూ. 19,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది మీకు 23% తగ్గింపును ఇస్తుంది. ఈ ఆఫర్ ద్వారా రూ. 6,000 ఆదా చేయవచ్చు.

ఈ టాప్ 5 ఉత్తమ ఆల్ రౌండర్ 5G స్మార్ట్‌ఫోన్‌లు రూ.20,000లోపు లభించే స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు. వీటిలో మీ ఛాయస్ ఏది అనేది కామెంట్ లలో తెలియచేయండి.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Read more about:
Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X