వీడియో రికార్డింగ్ కోసం కొత్త మరియు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...

ప్రస్తుత రోజులలో స్మార్ట్‌ఫోన్‌లను కేవలం ఫోన్ కాల్స్ కోసం మాత్రమే ఉపయోగించడం లేదు. కొన్ని ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు మెటల్ మరియు గ్లాస్ స్లాబ్‌లను కలిగి ఉండడమే కాకుండా అద్భుతమైన హార్డ్‌వేర్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇంటెన్సివ్ అప్లికేషన్‌లు మరియు గేమ్‌లను మరింత శక్తివంతంగా నిర్వహించడానికి వీలుగా కొన్ని ఆసక్తికరమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి. కొన్ని ఆధునిక మొబైల్‌లు ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీలలో కూడా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి.

 
వీడియో రికార్డింగ్ కోసం కొత్త మరియు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...

ముందు రోజులలో వీడియో రికార్డింగ్ కోసం పెద్ద సైజ్ కెమెరాను తీసుకొని వెళ్లేవారు. అయితే స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావడంతో స్టిల్ ఫోటోలను మెరుగైన ఫలితాలతో క్లిక్ చేయడంతో పాటుగా వీడియో కాలింగ్‌ కోసం కూడా స్మార్ట్‌ఫోన్‌లు గొప్పగా పనిచేస్తున్నాయి. భారతదేశంలో ఇటీవల విడుదలయ్యి వీడియో రికార్డింగ్ కోసం మెరుగైన మద్దతును ఇచ్చే ఉత్తమ ఫోన్‌ల జాబితా గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా

Samsung Galaxy S22 Ultra 5G (Phantom Black, 12GB, 512GB Storage) with No Cost EMI/Additional Exchange Offers
₹1,18,999.00
₹142,999.00
17%

శామ్‌సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ యొక్క 12GB ర్యామ్ + 512GBస్టోరేజ్ వేరియంట్ ఇండియాలో రూ.1,18,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఎడ్జ్ QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో లభిస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతూ 12GB వరకు RAM మరియు 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు రెండు 10-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్‌లను కలిగి ఉన్న క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ కెమెరా సెటప్ Galaxy S22 Ultraని ప్రస్తుతం మార్కెట్‌లో చిత్రాలు మరియు వీడియోలను క్లిక్ చేయడానికి ఉత్తమ ఫోన్‌లలో ఒకటిగా చేస్తుంది. ఇది 5000mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

ఒప్పో రెనో 6 ప్రో 5G

Oppo Reno 6 Pro 5G (Aurora, 12GB RAM, 256GB Storage), Medium (CPH2249)
₹39,000.00
₹46,990.00
17%

Oppo Reno 6 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రూ.39,989 ధర వద్ద లభిస్తుంది. ఇది 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ తో లభిస్తూ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది కర్వ్డ్ డిస్‌ప్లే యొక్క ఎడమవైపు ఎగువ మూలలో ఉన్న పంచ్-హోల్ కటౌట్‌లో ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో బెస్ట్ వీడియో రికార్డింగ్‌ మద్దతుతో 64 + 8 + 2 + 2 MP క్వాడ్ రియర్ కెమెరాను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5G, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

 

IPHONE 13 PRO MAX

Apple iPhone 13 Pro Max (256GB) - Sierra Blue
₹1,39,900.00

ఆపిల్ ఐఫోన్ 13 ప్రో మాక్స్ ఫోన్ నేడు ఇండియాలో రూ.1,27,490 ధర వద్ద లభిస్తుంది. ఇది ఆపిల్ యొక్క అంతర్గత A15 బియోనిక్ SoC తో నిర్మించబడి ఉంటాయి. ఇందులో 6 కోర్ CPU మరియు అధిక-పనితీరు కోసం నాలుగు సమర్థవంతమైన కోర్లు మరియు 16-కోర్ న్యూరల్ ఇంజన్‌ని కలిగి ఉంది. మెరుగైన ప్రకాశాన్ని పొందడానికి ఆపిల్ యొక్క ప్రోమోషన్ 120Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను కూడా పొందుతుంది. ఇతర ఫీచర్లలో ఇది 3X ఆప్టికల్ జూమ్‌తో కూడిన కొత్త 77mm టెలిఫోటో కెమెరా ఉంది. బెస్ట్ వీడియో రికార్డింగ్‌తో ఫోన్ వెనుక భాగంలో 12 + 12 + 12 MP ట్రిపుల్ రియర్ కెమెరాను మరియు ఫోన్ ముందు భాగంలో 12 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది ఒక సబ్జెక్ట్ నుండి 2cm వరకు మాక్రో షాట్‌లను తీయగల అల్ట్రా-వైడ్ కెమెరా మరియు f/1.5తో కూడిన ప్రైమరీ వైడ్ కెమెరాలను కూడా కలిగి ఉన్నాయి.

IQOO 9 PRO

iQOO 9 Pro 5G (Legend, 12GB RAM, 256GB Storage) | Snapdragon 8 Gen 1 Mobile Processor | 120W FlashCharge | Extra Rs.4000 Off on Exchange | Upto 12 Months No Cost EMI | iQOO Premium Services
₹69,990.00
₹79,990.00
13%

iQOO 9 ప్రో భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన ఫోన్‌లలో ఒకటి. ఇది 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ రూ.64,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 6.78-అంగుళాల 2K E5 AMOLED డిస్‌ప్లేతో వస్తుంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్ మరియు LTPO 2.0 ప్యానెల్, 300Hz టచ్ శాంప్లింగ్ మరియు 1000Hz ఇన్‌స్టంట్ టచ్‌తో జత చేయబడింది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ద్వారా ఆధారితం మరియు iQOO IDC (ఇంటెలిజెంట్ డిస్‌ప్లే చిప్) కూడా కలిగి ఉంది, ఇది HDR మరియు అధిక ఫ్రేమ్-రేట్‌లను అనుకరించడానికి గేమ్‌లలో ఉపయోగించవచ్చు. మీరు X-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో పాటు 12GB LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజ్‌ని పొందుతారు. iQOO 9 ప్రోలో గింబల్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50MP GN5 ప్రధాన కెమెరాతో పాటు వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలు మరియు మరో 50MP 150-డిగ్రీ వైడ్-యాంగిల్ ఫిష్‌ఐ కెమెరా మరియు 2.5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 16MP పోర్ట్రెయిట్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో 16MP కెమెరా సెంటర్-అలైన్డ్ పంచ్-హోల్‌లో ఉంటుంది.

VIVO X80 PRO

VIVO X80 PRO మొబైల్ ఇండియాలో రూ.79,999 ధర వద్ద లభిస్తుంది. ఈ మొబైల్ 6.78 అంగుళాల క్వాడ్‌ HD+ E5 AMOLED LTPO పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core Dimensity 9000 4nm ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 12జీబీ ర్యామ్, 256జీబీ|512 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ నాలుగు కెమెరాల‌ ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ప్ర‌ధానం 50MP + 48MP + 12MP + 8MP క్వాలిటీతో కెమెరాల‌ని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4700mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది. ఈ డివైజ్ (IP68) వాట‌ర్ రెసిస్టెంట్ టెక్నాల‌జీని క‌లిగి ఉంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X