Home
Deal of the day

5500mAh బ్యాటరీ, 6.78 అంగుళాల కర్వడ్‌ డిస్‌ప్లే, 50MP సెల్ఫీ కెమెరా ఫోన్‌పై రూ.7000 డిస్కౌంట్‌..!!

వివో T4 అల్ట్రా ఫోన్‌ జూన్‌ 11 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలను కూడా వెల్లడించింది. ప్రస్తుతం వివో T3 అల్ట్రా మోడల్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ గత సంవత్సరం అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే ఈ ఫోన్ ధరను కూడా వివో తగ్గించింది. తాజాగా బ్యాంకు కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌ 3D కర్వడ్ అమోలెడ్‌ డిస్‌ప్లే తోపాటు డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంది.

భారత్‌ మార్కెట్‌లో వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ (Vivo T3 Ultra Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ రూ.31999 కు విడుదల అయింది. ప్రస్తుతం వివో ఇండియా ఇ-స్టోర్‌లో రూ.27,999 ధరకు అందుబాటులో ఉంది. అయితే HDFC, ICICI బ్యాంకు కార్డుల ద్వారా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

vivo T3 Ultra smartphone price drop june 2025

ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌తో ఫోన్‌ను రూ.24999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే విడుదల ధరతో పోలిస్తే రూ.7000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. బ్యాంకు ఆఫర్‌తో మిగిలిన రెండు వేరియంట్స్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.26999, రూ.28999 ధరలకు కొనుగోలు చేయవచ్చు.

ఆఫర్‌ ఎప్పటి వరకు అందుబాటులో ఉందంటే :
ఈ ఆఫర్‌ జూన్‌ 30 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వివో ఇండియా ఇ-స్టోర్‌లోనే ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ ఆందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫ్రాస్ట్‌ గ్రీన్‌, లూనార్‌ గ్రే కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. మరియు 2 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందనుంది.

డిస్‌ప్లే వివరాలు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5k 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 480Hz టచ్ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే HDR10+ ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ ఫ్రూఫ్‌గా ఉంది.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా వివో హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. Aura Ring Light కూడా కలిగి ఉంది.

5500mAh బ్యాటరీ :
ఈ వివో T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ AI Photo Enhance, AI Eraser వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.

Best Mobiles in India

English summary
Vivo offers Rs3000 bank discount on vivo T3 Ultra smartphone upto june 30 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X