ఈ Vivo ఫోన్ పై రూ.3500 డిస్కౌంట్.. 5500mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, 8GB ర్యామ్..!
భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న బ్రాండ్స్‌లో వివో కూడా ఉంది. దీంతో బడ్జెట్, మిడ్ రేంజ్, ఫ్లాగ్ షిప్ మోడల్స్‌లో వివో అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. గత సంవత్సరం విడుదల అయిన వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రూ.20 వేల ధరలో బెస్ట్ హ్యాండ్‌సెట్‌గా ఉంది. ఈ ఫోన్ 5500mAh బ్యాటరీ, FHD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది.
వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Vivo T3 Pro 5G Smartphone) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.24,999 గా ఉండేది. మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉండేది. ఈ సంవత్సరం మార్చిలో రూ.2 వేల చొప్పున ధరలను వివో తగ్గించింది. ఫలితంగా ఈ ఫోన్ ప్రస్తుత ధరలు రూ.22,999, రూ.24,999 గా ఉన్నాయి.

రూ.3500 డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. అన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్‌లపై రూ.3,500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుపై 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ వివో ఫోన్ ఎమరాల్డ్ గ్రీన్, శాండ్‌స్టోన్ ఆరెంజ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే :
వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ HD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2000Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Schott Xensation గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
ఈ వివో ఫోన్ డిస్‌ప్లే వెట్ టచ్ టెక్నాలజీ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. తడి చేతులతోనూ ఈ ఫోన్ ను ఆపరేట్ చేయవచ్చు. డిజైన్ పరంగా శాండ్‌స్టోన్ కలర్ వేరియంట్ వేగాన్ లెదర్ ఫినిష్‌తో లభిస్తుంది. అదే ఎమరార్డ్ గ్రీన్ కలర్ వేరియంట్ మ్యాటీ ఫినిష్‌తో లభిస్తుంది.
వివో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. దీంతోపాటు Adreno 720 HPU ను కూడా కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB LPDDR4X ర్యామ్ మరియు 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ఈ వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882 కెమెరా (OIS, EIS), 8MP అల్ట్రావైడ్ లెన్స్, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ AI Erase, AI Photo Enhance ఫీచర్‌లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.
గమనిక : గిజ్‌బాట్ వెబ్‌సైట్‌లోని అఫిలియేట్ లింక్స్ ద్వారా చేసిన కొనుగోళ్ల నుంచి కమీషన్‌ను సంపాదిస్తుంది. ఉత్పత్తులకు సంబంధించిన అసలైన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవం ఆధారంగా సిఫార్సు చేయబడతాయి. అది కూడా మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.


Click it and Unblock the Notifications








